YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ మూడు సీట్లపై గురి....

ఆ మూడు సీట్లపై గురి....

క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. బీజేపీకి జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టినా.. నోట్లో బెల్లం పెట్టి నెత్తిన గుద్దిన చందంగా ప‌రిస్థితిని త్రిశంకు స్వ‌ర్గం చేశారు. మ్యాజిక్ ఫిగర్‌కు కూసింత ఇవ‌త‌ల‌గా నిల‌బెట్టి.. న‌గుబాటు చేశారు. అయితే, ఇప్పుడు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మూడు నియోజ‌క‌ర్గాల్లో ఎన్నిక‌లు బీజేపీకి కీల‌కం కానున్నాయి. వివిధ కార‌ణాల‌తో రెండు నియోజ క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ప్ర‌ధాన పార్టీ బీజేపీకి 104 స్థానాలు ద‌క్కిన నేప‌థ్యంలో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను కైవ‌సం చేసుకుంటే.. స్వ‌తంత్రంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మ‌రికొంత అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ మూడు సీట్ల‌లోనూ బీజేపీ ఎదురీదుతోంది. ఈ పార్టీకి గెలుపు అంత స‌లువు అయితే కాదు. దీంతో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి పెరుగుతోంది.జయనగర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విజయకుమార్‌ అకస్మిక మృతితో ఎన్నిక వాయిదా పడింది. బెంగళూరులోని రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నం నాయుడుకు సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో 9 వేలకుపైగా ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడిన నేప‌థ్యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నికలను ఎన్నిక‌ల‌ కమిషన్‌ వాయిదా వేసింది. ఇక జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి రెండు నియోజకవర్గాలు చెన్నపట్టణ, రామనగర్‌లలోనూ గెలుపొందారు. దీంతో ఒక స్థానానికి రాజీనామా చేయక తప్పదు.ఇలా మూడు నియోజకవర్గాలలో ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపుకోసం పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మారిన సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఒక్కటయ్యాయి. జయనగర కాంగ్రెస్‌ అభ్యర్థిగా సౌమ్యరెడ్డి పేరు ఖరారైంది. ఈ స్థానం నుంచి జేడీఎస్‌ తప్పుకుని ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి మృతిచెందినా ఇప్పుడు కాంగ్రెస్‌, జేడీఎస్ ఒక్క‌టి అవ్వ‌డంతో పాటు బెంగ‌ళూరు ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ట్టు ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేయ‌డంతో ఇక్క‌డ పోటీ హోరాహోరీగా ఉండ‌నుంది.ఇక రాజరాజేశ్వరీనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరత్నపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనను తప్పించి జేడీఎస్‌ అభ్యర్థికి రెండు పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. ఇక కుమారస్వామి ఏ స్థానం వదులుకున్నా అక్కడనుంచి ఆయన భార్య అనితా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మద్దతు ఇస్తాయి. ఇది జేడీఎస్ కంచుకోట‌. ఇలా జేడీఎస్‌కు రెండు స్థానాలు పెరిగే అవకాశం కలసి వస్తుంది. మ‌రో ప‌క్క‌మాత్రం.. ఎలాగూ త‌మ‌కు 104 స్థానాలు ద‌క్కాయి కాబ‌ట్టి ఈమూడు చోట్లా గెలుపొందితే.. త‌మ‌కు తిరుగుండ‌ద‌ని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ మూడు స్థానాలూ అన్ని పార్టీల‌కూ ప్రాధాన్యం అయిపోయాయి. ఈ మూడు చోట్ల ఎన్నిక‌లు హోరాహోరీగా సాగ‌డం ఖాయం. మ‌రి పోలింగ్ ఎప్పుడో చూడాలి.

Related Posts