YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బండ్లను రెచ్చగొడుతుంది ఎవరు...?

బండ్లను రెచ్చగొడుతుంది ఎవరు...?

హైదరాబాద్, ఏప్రిల్ 20,
బండ్ల గ‌ణేశ్‌. ఫుల్ కాక మీదున్నారు. ఒక్క‌సారిగా రెచ్చిపోయారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని ట్విట‌ర్‌లో కుమ్మేశారు. క‌మ్మ కులాన్ని అవ‌మానిస్తారా పిచ్చి పిచుకా అంటూ పుచ్చ రేగొట్టారు. వ‌రుస పెట్టి.. ఏకే 47 తూటాల్లాంటి ట్వీట్ల‌తో.. విజయసాయిరెడ్డిని తూట్లు పొడిచారు. ఒక రోజంతా ట్రెండింగ్‌లో నిలిచారు. సాయిరెడ్డి సైతం బండ్ల‌కు కౌంట‌ర్ ఇచ్చినా.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇంత‌కీ, స‌డెన్‌గా బండ్ల గ‌ణేశ్‌కు ఎందుకంత‌గా పొడుచుకు వ‌చ్చింది? క‌మ్మ వ‌ర్గాన్ని గ‌తంలోనూ విజ‌య‌సాయి నానా మాట‌లు అన్నారు.. అప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకింత‌లా రెచ్చిపోయారు? ఆయ‌నే రెచ్చిపోయారా?  లేక‌, ఎవ‌రైనా రెచ్చ‌గొట్టారా? బండ్ల‌ వెనుక‌ బొత్స ఉన్నారా? జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లోనే ఇదంతా జ‌రుగుతోందా? విజ‌య‌సాయికి చెక్ పెడుతున్నారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు, అంత‌కుమించి అనుమానాలు. అవును, బండ్ల గ‌ణేశ్ వెనుక ఉన్న‌ది జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కానేకాదు. అది బొత్స స‌త్య‌నారాయ‌ణే అంటున్నారు. ప‌వ‌న్‌కు మండితే.. డైరెక్ట్‌గా ముక్కుసూటిగానే అనేస్తారు ఇలా మ‌రొక‌రితో అనిపించే టైప్ కాదు జ‌న‌సేనాని. ఇక టీడీపీకి బండ్ల‌కు అస‌లేమాత్రం సంబంధం లేదు. ఇక గ‌ణేషే నేరుగా విమ‌ర్శించార‌ని కూడా అనుకోలేం. రోజూ స‌వాల‌క్ష విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి.. అందులోంచి విజ‌య‌సాయి టార్గెట్‌గానే బండ్ల చెల‌రేగిపోవ‌డం.. వెనుక పెద్ద నేత‌లే ఉన్నారంటున్నారు. అది మ‌రెవ‌రో కాదు బొత్స‌నే అనే అనుమానం. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు బండ్ల గ‌ణేశ్ బినామీ అనే టాక్ మొద‌టినుంచీ ఉంది. గ‌తంలో సినిమా ప్రొడ్యూస‌ర్‌గా ఉన్న‌ప్పుడు బినామీ అనే ఆరోప‌ణ ప్ర‌ముఖంగా వినిపించింది. బండ్ల సైతం బినామీ అనే మాట‌ను ఒప్పుకోక‌పోయినా.. బొత్స స‌త్య‌నారాయ‌ణకు తాను అత్యంత ఆప్తుడిన‌ని ఒప్పుకుంటారు. త‌న‌కు బొత్స‌ గాడ్‌ఫాద‌ర్ లాంటి వార‌ని త‌రుచూ చెబుతుంటారు. వారిద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఓపెన్ సీక్రెట్‌. అందుకే, లేటెస్ట్ ఎపిసోడ్‌లోనూ బొత్స పేరే వినిపిస్తోంది. అందుకు బ‌ల‌మైన‌ కార‌ణాలే వినిపిస్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స సత్య‌నారాయ‌ణ‌కు మ‌రోసారి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అంటే, జ‌గ‌న‌న్న ద‌గ్గ‌ర బొత్స‌కు మంచి ప్రాధాన్యం ఉన్న‌ట్టే. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఉత్త‌రాంధ్ర మొత్తం బొత్స గుప్పిట్లోనే ఉండేది. ఆయ‌న చెప్పిందే శాస‌నం అన్న‌ట్టు పెత్త‌నం సాగేది. కానీ, జ‌గ‌న్ రాజ్యంలో.. విజ‌య‌సాయిని ఉత్త‌రాంధ్ర‌కు సామంత రాజుగా నియ‌మించ‌డంతో బొత్త అధికారం చీపురుపల్లికే ప‌రిమిత‌మైంది. పేరుకు మంత్రే అయినా బొత్త ప‌ప్పులేమీ ఉడ‌క‌కపోయేది. విశాఖ నుంచి శ్రీకాకుళం వ‌ర‌కూ.. క‌లెక్ట‌ర్ల నుంచి వీఆర్వోల వ‌ర‌కూ.. అంతా విజ‌య‌సాయి చెప్పిన‌ట్టు వినాల్సిందే...అంటారు. ఇక మంత్రి బొత్సకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బదిలీలు, భూముల వ్యవహారాలు చక్కబెట్టేస్తుండటం కళ్లమంటగా మారిందంటారు. మూడేళ్లుగా సాయిరెడ్డి పెత్త‌నాన్ని త‌ట్టుకోలేక పోయిన‌ బొత్స.. స‌రైన స‌మ‌యం కోసం ఓపిక ప‌డుతూ వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఎప్పుడైతే సీఎం జ‌గ‌న్.. విజ‌య‌సాయిరెడ్డికి ప్రాధాన్యం త‌గ్గించారో.. ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి.. తాడేప‌ల్లికి షిఫ్ట్ చేశారో.. అప్పుడిక బొత్స త‌న పావులు క‌ద‌ప‌డం ప్రారంభించార‌ని.. అందులో భాగంగా మొద‌టి పావు.. త‌న న‌మ్మిన బంటు బండ్ల గ‌ణేశ్‌ను విజ‌య‌సాయిపైకి ఉసిగొల్పార‌ని చెబుతున్నారు. ఇలా, విమ‌ర్శ‌ల‌తో విజ‌య‌సాయిని కాంట్ర‌వ‌ర్సీ ఫెలో గా క్రియేట్ చేసి.. ఉత్త‌రాంధ్ర నుంచి వెళ్లిపోయే స‌మ‌యంలో ఆయ‌న ఇమేజ్‌ను మ‌రింత‌గా డ్యామేజ్ చేసి.. ఉత్త‌రాంధ్రలో క్రియేట్ అయిన‌ వ్యాక్యూమ్‌ను ఒక్క‌సారిగా తాను ఆక్ర‌మించుకోవాల‌నేది బొత్స స్కెచ్ అంటున్నారు. అదంతా జ‌స్ట్ బొత్స మాత్ర‌మే చేయిస్తున్న‌ది కాద‌ని.. ఆయ‌న‌కు జ‌గ‌న్ ఆశీర్వాద‌మూ ఉంద‌ని తెలుస్తోంది. ట్విట‌ర్ స్క్రీన్‌ మీద బండ్ల గ‌ణేశ్‌.. విజ‌య‌సాయి మాత్ర‌మే క‌నిపిస్తున్నా... ఆ పిట్ట కూత‌ల వెనుక తాడేప‌ల్లి పెద్ద‌లు, చీపురుప‌ల్లి సీనియ‌ర్లు ఉన్నార‌ని అంటున్నారు.

Related Posts