హైదరాబాద్, ఏప్రిల్ 20,
తెలంగాణలో ముందస్తు అన్నదే రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్. ముందస్తు ఎన్నికల కోసమే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు. ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందేందుకే...ఒక అడుగు వెనక్కు వేసి మరీ యాసంగి వడ్లు ముందుకు వచ్చారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమే అయినే ఇప్పటికిప్పుడు ఆయనా ధైర్యం చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నది పరిశీలకుల విశ్లేషణ్. 2023 మే లేదా 2022 డిసెంబర్ కేసీఆర్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలే అధికం. ఎందుకంటే బిజెపిని నిలువరించడం కోసమే కేసీఆర్ ఈ ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎన్నికలు జరుగుతుంటే...మోత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంతా మోహరించి పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న జంకు కేసీఆర్ లో ఉంది. ఆలేరు ఉప ఎన్నిక తీసుకున్నా, హుజూరాబాద్ ఉప ఎన్నిక తీసుకున్నా...అంతకన్నా ముందు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలను చూసినా...అప్పట్లో దేశంలో మరెక్కడా ఎటువంటి ఎన్నికలూ జరగడంలేదు. దీంతో బీజేపీ కోర్ నేతలంతా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. దీంతో ఫలితం టీఆర్ఎస్ కు ప్రతికూలంగా వచ్చింది. ఎన్నిక ఏదైనా, ఎప్పుడైనా విజయం మాదే అన్న టీఆర్ఎస్ విశ్వాసాన్ని కమలం వ్యూహాత్మకంగా దెబ్బతీసిన సందర్భాలవి. అందుకే కేసీఆర్ ముందస్తు ప్రణాళిక అత్యంత జాగ్రత్తగా రచిస్తున్నారు. బీజేపీ కోర్ నాయకత్వం తెలంగాణపై కాన్ సంట్రేట్ చేయడానికి అవకాశం లేని సమయంలో ముందస్తు ఎన్నికలకు అడుగు వేసి లబ్ధి పొందాలన్నదే కేసీఆర్ యత్నంగా భావించాలి. అందుకే 2022 చివరిలో, లేదా 2023 ప్రథమార్థంలో కేసీఆర్ ముందస్తుకు ముందుకు వస్తారని తెరాస శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. . 2022 డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 ప్రథమార్థంలో జరుగుతాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలో ఉంది. వీటితో పాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే....బీజేపీ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ, దృష్టి పెట్టే అవకాశం ఉండదన్నది కేసీఆర్ భావనగా కనిపిస్తున్నది. అందుకే ఆ సమయంలో ముందస్తుకు వెళితే రాజకీయంగా ఎదురుండదని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు. 2018లో తెరాస ఎందుకు ముందస్తుకు వెళ్లిందో...ఇప్పుడు కూడా దాదాపు అదే కారణంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అప్పట్లో 2019లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళితే.. జాతీయ స్థాయి అంశాలు ప్రభావం చూపుతాయి. తద్వారా అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశాలు మెండు అని కేసీఆర్ భావించారు. అప్పుడు ఆ వ్యూహం కేసీఆర్ కు కలిసి వచ్చింది. మంచి మెజారిటీతో అధికారంలోనికి వచ్చింది. నాటి ఎన్నికలలో బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. 2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ అదనంగా 4 ఎంపి సీట్లను కైవసం చేసుకుంది బిజెపి. అప్పుడు ముందస్తు ఎన్నికల వ్యూహం ఫలించింది. మరి ఇప్పుడు కేసీఆర్ ఏ వ్యూహంతో ముందస్తుకు వెళుతున్నారు? టీఆర్ఎస్ పూర్తిగా ఐదేళ్లు అధికారంలో కొనసాగి ఎన్నికలకు వెళ్లాల్స వచ్చినా 2023 ద్వితీయార్ధం వరకూ సమయం ఉంది. 2023లో పార్లమెంట్ ఎన్నికలు లేవు. అయినా కేసీఆర్ ముందస్తు వ్యూహం ఎందుకంటే 2023లో పార్లమెంట్ ఎన్నికలు లేకున్నా... ఆ సమయంలో దేశంలో మరే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కేవలం తెలంగాణ అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు జరగడం అంటూ జరిగితే..అప్పుడు బిజెపి ప్రచార దూకుడును ఎదురోకవడం అంత తేలిక కాదన్నది కేసీఆర్ భావనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచార దాడే నిదర్శనమని ఉదహరిస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి రాష్ట్ర నాయకత్వం అంతా మోహరించి ప్రచార భేరి మోగించింది. జిహెచ్ఎంసి ఎన్నికల విషయానికి బిజెపి జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగారు. అమిత్ షా, స్మృతి ఇరానీ, జెపి నడ్డా, యోగి ఆదిత్యానాథ్, హేమంత్ బిస్వాస్ తో పాటు పలువురు నూతలూ ప్రచారంలో భాగం పంచుకున్నారు. వారి ప్రచార వేడి పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజల దృష్టిని బీజేపీ వైపు మరల్చింది. పలితం అందుకు అనుగుణంగానే వచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అంటే బిజెపి జాతీయ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులే ప్రధాని మోడీ కూడా విస్తృతంగా ప్రచారం చేసేందుకు వచ్చే అకాశాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మోడీ తన ఆహార్యాన్ని కూడా మార్చుకుని మరీ అక్కడ పలు మార్లు పర్యటించి ర్యాలీలలో పాల్గొన్నారు. తెలంగాణలో ఆ పరిస్థితే కనుక తలెత్తితో మూడో సారి అధికారంలోకి రావాలన్న తన ఆకాంక్ష నెరవేరడం అంత సులభం కాదన్నదని గులాబీ బాస్ అంచనాగా కనిపిస్తున్నది. దేశంలో మరెక్కడా ఎన్నికలు లేకుండా ఒక్క తెలంగాణలోనే ఉంటే. బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణలోనే ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ఈ మారు గుజరాత్ లేదా కర్ణాటక ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగేలా ప్రణాళికా రచన చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడైతే బిజెపి నాయకత్వం తెలంగాణపైన మాత్రమే ఫోకస్ పెట్టే అవకాశాలు ఉండవు. కర్ణాటక, గుజరాత్ లలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాలపైనే ఎక్కవ కాన్ సన్ ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో విజయం పార్టీకి ప్రతిష్టాత్మకం అవుతుంది. అందుకే ఆ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలోనే మరీ ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగితే బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టే అవకాశాలుండవు. అందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తథ్యం. ఈ విషయాన్ని ఇప్పటికే కేసీఆర్ పార్టీ కేడర్ కు విస్పష్టంగా చెప్పేశారు. అయితే ఆ ముందస్తు టైమ్ విషయంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా స్పష్టత ఇవ్వడం లేదు. కర్ణాటక లేదా గుజరాత్ ఎన్నికలతో పాటే రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలే మెండు అని పరిశీలకులు చెబుతున్నారు. దాదాపుగా కేసీఆర్ ఆ విధంగానే పావులు కదుపుతున్నారా? అన్నది రానున్న రోజులలోనే తేలుతుంది.