కాంగ్రెస్ పార్టీలో సంచలనం నమోదు కానుందా? ఆ పార్టీలో ఇప్పటి వరకు ఉన్న యువరాజు రాహుల్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంటే .. తాజా రాజకీ య పరిణామాలు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఔననే అంటున్నాయి. రాజకీయాల్లోకి ఏ టైంలో అడుగు పెట్టాడో కానీ, రాహుల్ గాంధీ అన్ని విధాలా ఫెయిల్ అవుతున్నాడు. అటు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ సహా విపక్షాలను ఇరుకున పెట్టేలా ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఇక, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను కాపాడుకోవడంలోనూ ఆయన సక్సెస్ కాలేక పోయాడు. ఇక, ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ బలంగా పుంజుకునేందుకు అవసరమైన అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వలేక పోతున్నాడు.ఒకప్పుడు దేశాన్ని శాసించిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాలకే అది కూడా మిజోరం వంటి అతి చిన్న ఈశాన్య రాష్ట్రానికే పరిమితం అయ్యే పరిస్థితులు వచ్చాయి. అతి పెద్ద రాష్ట్రాల్లో పొలిటికల్ అజెండాలు లేకపోవడం, సరైన సమ యంలో సరైన విధంగా స్పందించకపోవడం వంటివి పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి. అతి పెద్దరాష్ట్రం కర్ణాటకలో అధికారం నిలబెట్టుకునే విషయంలో ప్రదర్శించిన అతిశయం.. పార్టీని నడిరోడ్డులో నిలబెట్టింది. ప్రధానంగా బీజేపీ సారథి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ ద్వయం వేస్తున్నపాచికలకు రాహుల్ బొక్కబోర్లా పడిపోతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి వస్తే.. జేడీఎస్ రాష్ట్ర చీఫ్ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేయాల ని ప్రియాంక.. రాహుల్ గాంధీకి చెప్పారని సమాచారం. దీంతో వెంటనే రాహుల్.. చక చకా పావులు కదిపాడు. దీంతో అప్పటి వరకు ఎన్నో ఆశలతో ఉన్న బీజేపీ నాయకులకు కళ్లలో నీళ్లు కూడా మిగలలేదట! ప్రస్తుతం గవర్నర్ కరుణిస్తే.. కాంగ్రెస్, జేడీఎస్‌ల పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలా కాంగ్రెస్‌కు అన్నీతానై గత నాలుగేళ్లుగా ప్రియాంక చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ ప్రియాంకే అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమె కనుక కాంగ్రెస్‌లోకి వచ్చి.. నిలబడితేనే తప్ప మోడీని నిలువరించే ఛాన్స్ ఉండదని అంటున్నారు కాంగ్రెస్‌లోని సీనియర్లు.వారిని నిలువరించే ప్రయత్నం కానీ, వారికి ధీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేయడం కానీ.. ఆయన చేయలేక పోతున్నారు. మరో ఏడాదిలోనే ఉన్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు అంత ఈజీకాదు. ఈ నేపథ్యం లో కాంగ్రెస్‌లో వ్యూహ రచన చేయడంతోపాటు ప్రజలను ఆకట్టుకునేందుకు పాశుపతాస్త్రం కాంగ్రెస్‌కు అత్యంత అవ సరం. ఆది నుంచి నేతల చూపు సోనియా కుమార్తె ప్రియాంకపై ఉంది. ఆమెలో ఇందిర పోలికలు ఉండడం, వాక్చాతుర్యంతో మాట్లాడడం వంటివి ప్రజలకు పార్టీని తిరిగి చేరువ చేస్తుందని అంటున్నారు. ఇక, తాజాగా కర్ణాటకలో నిన్న వచ్చిన ఫలితాల నేపథ్యంలో మధ్యాహ్నం భోజనం సమయంలో రాహుల్, సోనియా, ప్రియాంకలు కలిసినప్పుడు ప్రియాంకే చొరవ తీసుకుని కర్ణాటకపై పెదవి విప్పిందట. కర్ణాటకలో మనం(కాంగ్రెస్) జేడీఎస్‌తో పొత్తుకు సిద్ధమైతే.. ప్రధాని మోడీని నిలువరించినట్టే అవుతుందని ఆమె ఐడియా ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఇదే జరిగితే. భారత రాజకీయాల్లో మరో ఇందిర శకం ప్రారంభమైనట్టే!