కాకినాడ
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ శివారు అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న సారా బట్టి పై జగ్గంపేట ఎస్ ఐ రఘునాథరావు తమ సిబ్బందితో దాడి చేశారు. మల్లిసాల గ్రామ అటవీ పరివాహక ప్రాంతంలో రహస్యంగా బెల్లపు నిల్వ ఉంచి, అక్రమ నాటుసారాను తయారు చేస్తున్నట్లు ఎస్ఐ రఘునాథరావు కు వచ్చిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున ఎస్ఐ రఘునాథరావు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి అక్రమంగా నిర్వహిస్తున్న సారా బట్టి పై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో సారా తయారీ కి సిద్ధంగా నిల్వ ఉంచిన సుమారు వెయ్యి లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేయడంతో పాటు, సారా తయారీ కి ఉపయోగించే సామాగ్రిని ధ్వంసం చేసి,15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సై రఘునాథరావు తెలిపారు.మల్లిశాల కి చెందిన సీరా నాగేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి కోర్టు లో హాజరుపరుస్తామన్నారు.