YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఉదయకిరణ్ బయోపిక్??

 ఉదయకిరణ్ బయోపిక్??

తెలుగునాట బ‌యోపిక్‌ల ట్రెండ్‌కు శ్రీ‌కారం చుట్టిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో..  అదే బాట‌లో మ‌రిన్ని బ‌యోపిక్ చిత్రాలు తెర‌పైకి రావ‌డానికి ముస్తాబవుతున్నాయి. వాటిలో.. ఒక‌ప్పటి యువ సంచలనం ఉదయ్ కిరణ్ బయోపిక్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. కాస్త‌ వివరాల్లోకి వెళితే..  ‘చిత్రం’, నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’.. ఇలా కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలను చవి చూసి.. తెలుగు సినీ పరిశ్రమలో క‌థానాయ‌కుడిగా సంచలనాన్ని సృష్టించారు యంగ్ హీరో ఉదయ్ కిరణ్. అంతేగాకుండా..  ఫిల్మ్‌ఫేర్‌ను (‘నువ్వు నేను’ చిత్రానికి గాను) అందుకున్న అతి పిన్న వయస్కుడిగా కమల్ హాసన్ తర్వాత ఆ జాబితాలో చేరారు ఉదయ్ కిరణ్.  అలా వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఈ హీరో కెరీర్, లైఫ్‌..  ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనయింది. అవి ఎంతవరకు తీసుకుని వెళ్ళాయంటే.. ఆఖరికి ఈ యువ కథానాయకుడు బతుకు భారం మోయలేక తనువు చాలించే స్థాయికి దిగజార్చేసాయిమహానటి సావిత్రి జీవితానికి కాస్త అటు ఇటుగా ఉదయ్ కిరణ్ జీవితం కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ యంగ్ హీరో జీవితాన్ని కూడా బయోపిక్‌గా తీయడానికి దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్నారు. ఉదయ్ కిరణ్‌తో మంచి అనుబంధం ఉండడం.. అంతేగాక వీరిద్దరి కెరీర్ కూడా ‘చిత్రం’ సినిమాతోనే ప్రారంభం కావడంతో.. ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తేజ తెరకెక్కించడానికి నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాని తేజ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకుని వెళ్తారో చూడాలి. 

Related Posts