YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రికవరి సొమ్ము మాయం

రికవరి సొమ్ము మాయం

ఒంగోలు, ఏప్రిల్ 21,
ఏపీ సర్కార్ రోజువారీ వ్యవహారాల కోసం కూడా రూపాయి రూపాయి వెతుక్కునే పరిస్థితిలో ఉంది. అప్పు చేయకుండా ఒక్కరోజు కూడా గడిచే పరిస్థితి లేదంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే  వాటిని వేటినీ ఖాతరు చేయకుండా సాగుతున్న జగన్ ఉచితాల పందేరాలతో ముందుకు సాగుతూనే ఉన్నారు. మరి వీటన్నిటికీ సొమ్మెక్కడిదన్న సందేహాలు అందరిలోనూ ముప్పిరిగొంటున్నాయి. కానీ క్రమంక్రమంగా ఉచితాల పందేరానికి జగన్ మంత్రం ఏమిటన్నది వెల్లడౌతున్నది. పంచాయతీ నిధులు, విపత్తు నిర్వహణ నిధులు ఇలా ఒక టేమిటి కనిపించిన ప్రతి ఖాతా నుంచి సొమ్ము బొక్కేసి మరో సారి అధికారంలోకి రావడానికి పెట్టుబడిగా ఉచితాలను పందేరం చేస్తున్నారు. అయితే ప్రభుత్వఖాతాల నుంచి బదలాయింపులు సరిపోవడం లేదేమో ఆఖరికి చోరీ సొత్తుపై కూడా ఆయన చూపు పడింది. చోరీలు, దోపిడీలు జరిగినప్పుడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల నుంచి చోరీ సొత్తు రికవర్ చేస్తారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రికవరీ వవరాలను కోర్టుకు నవేదిస్తారు. విచారణ తరువాత సదరు సొత్తును సొంత దారులకు అందజేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత ఆ సొత్తును సొంత దారులకు అందజేస్తారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పని జరగడం లేదు. కోర్టు ఆదేశాల తరువాత కూడా సదరు సొత్తు సొంత దారులకు చేరడం లేదు. ఎందుకా అని ఆరా తీస్తే .... ఔరా! అంటే ముక్కున వేలేసుకునేలంటి దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. అదేమిటంటే చోరీ రికవరీ సొత్తును కూడా జగన్ సర్కార్ వదలడం లేదట. ఆసొమ్మునూ ప్రభుత్వ ఖజానాకు తరలించేసి పబ్బంగడుపుకుంటోందట. సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తే సోమవారం ఒంటి పొద్దులుండి, మంది సొమ్ముతో మంగళవారం ముప్పొద్దులా తిన్నట్లు....తన అధికార యావతో జనం జనం సొమ్మును కూడా ఉచిత పథకాలకు వాడేస్తున్నారు. కోర్టుల్లో డిపాజిట్ల రూపంలో ఉండాల్సిన సొత్తును కూడా జగన్ సర్కార్ సొంత లాభం కోసం వాడేసుకుంటున్నది. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అన్నాడు మహాకవి గురజాడ ....  జగన్ సర్కార్ దానిని కొద్దిగా మార్చుకుని పొరుగువాడి సొత్తైనా వాడేసుకుని సొంత లాభం చూసుకోవోయ్ అన్నట్లు వ్యవహరిస్తున్నది.

Related Posts