YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తమ్ముళ్ల ప్రిపరేషన్స్ రెడీ

తమ్ముళ్ల ప్రిపరేషన్స్ రెడీ

విజయవాడ, ఏప్రిల్ 21,
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు పుట్టిన్రోజు. పండుగ రోజు.. పసుపు పార్టీ లోగిళ్ల‌లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్న రోజు కూడా ఆ రోజు రాజ‌ధాని విష‌య‌మై ఓ స్ప‌ష్ట‌త ఇచ్చారు. అమ‌రావ‌తి నిర్మాణానికి ఎంతో శ్ర‌మించారు. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా పెట్టుబ‌డులు కూడా వ‌చ్చాయి. త‌రువాత ఆయ‌నపై ఉన్న కోపంతో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కొన్ని త‌ప్పిదాలు చేసి వాటిని వెన‌క్కు మ‌ళ్లించిన సంద‌ర్భం కూడా ఉంది. టీడీపీని ఎదిరించే స్థాయిలో వైసీపీ ఉంది కానీ వైసీపీని పూర్తి స్థాయిలోనిలువ‌రించేందుకు టీడీపీకి ఉన్న శ‌క్తి అయితే చాల‌డం లేదు.ఆ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయక జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నా. యువ‌తని జాగృతం చేసే ఏకైక నేత చంద్ర‌బాబే అని చెప్పేందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఎంద‌రో నాయ‌కుల‌ను క‌ష్ట‌కాలంలో ముందుండి న‌డిపారు. ఈ రోజు మేమంతా ప‌ద‌వుల్లో ఉన్నామంటే కార‌ణం ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌కత్వం కీల‌కంగా నిలిచింది. అదేవిధంగా ఆ రోజు  నుంచి ఈ రోజు వ‌ర‌కూ నా వెంటే తెలుగు యువ‌త న‌డిచింది. యువ‌త నిప్పులాంటి వారు.. వారిలో చైత‌న్యాన్ని నింపి ప్ర‌తి ఇంటికీ ఓ మ‌ణిదీపంలా మార్చేశ‌క్తి నాయ‌క‌త్వానిదే..అటువంటి స‌మ‌ర్థ నాయ‌క‌త్వం చంద్ర‌బాబుతోనే సాధ్యం. ప‌ద‌వే ధ్యేయం గా ప‌నిచేసే నేత‌ల క‌న్నా రాష్ట్రం కోసం ప‌నిచేసే నేత‌ల‌ను ఎన్నుకోండి..అని చెప్పారాయ‌న.
ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలకు బాధ్యుల‌ను నియమించారు క‌నుక వాళ్లే భ‌విష్య‌త్ కాలంలో అంటే 2024లో అభ్య‌ర్థులు అని ప్ర‌భావ‌శీల‌కంగా ప్రొజెక్ట్ చేయ‌డం నేర్చుకోవాలి. ఆ విష‌యం ముందు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి..శ్రేణుల్లోకి వెళ్లాలి..శ్రేణుల అంగీకారం పొందే విధంగా నాయ‌క‌త్వం ఒప్పించ‌డం కూడా నేర్చుకోవాలి. అసంతృప్తులు తాము గెలిచి పార్టీని గెలిపించ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని!
క‌నుక అలాంటి వారిని దూరం పెడుతూ ఉండడం కూడా నేర్చుకోవాలి. కార్పొరేట్ లాబీయింగ్ అన్న‌ది అన్ని పార్టీల‌లో కూడా ఉంది క‌నుక ఏది ఎంత వ‌ర‌కో అంత వ‌ర‌కే అన్న స‌త్యాన్ని పాటించ‌డం కూడా అధినాయ‌క‌త్వం నేర్చుకోవాలి. లేదంటే నారాయ‌ణ లాంటి నాయ‌కులు ప‌దవులు అనుభ‌వించి ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం ఖాయం.

Related Posts