YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నాంపల్లిలో ప్రారంభమయిన టీజేఎస్ కార్యాలయం

నాంపల్లిలో ప్రారంభమయిన టీజేఎస్ కార్యాలయం

హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరామ్ నాంపల్లిలో తెలంగాణ జన సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య హాజరయ్యారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ తొలి తెలంగాణ ఉద్యమం 1969లో డా.చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి కార్యాలయంలోనే మళ్లీ తెలంగాణ జన సమితి కార్యాలయం ప్రారంబించామని వెల్లడించారు.  మనం కన్నా కళలు నిజం కావలంటే రాజకీయ అధికారం ఉండాలి.  కోదండరాం ను 10 సంవత్సరాల నుండి చాలా దగ్గరగా చూస్తున్నాను.  ఉద్యమం లో చాలా చురుకుగా పనిచేశారు.  కోదండరాం కార్యకర్తలలతో కలిసి మెలిసి ఉండేవాడని అన్నారు.  తెలంగాణ జన సమితి పరిపాలన కొత్త ఒరవడికి నాంది.  అంబెడ్కర్ ఆలోచనలను ఆచరణ లో పెట్టడానికి ముందుకు వస్తున్నారు కోదండరామని అన్నారు. గతంలో మేము కన్నా కళలను సాకారం చేయడానికి కోదండరాం ముందుకు  వచ్చారు.  అప్పట్లో  చాలా మంది దగ్గర నామినేషన్ వేయడానికి డబ్బులు కూడా ఉండేవి కావు..కానీ ఇప్పుడు చట్ట సభలలో డబ్బులు ఉన్నవాళ్లు  ఉన్నారు.  అమరవీరుల ఆత్మ గోషిస్తుంది కాబట్టి మీరు చట్ట సభల్లో వారి తరుపున మీరు మాట్లాడాలని అన్నారు.  డబ్బులకు తెలంగాణ ప్రజలు లొంగరు.  అప్పుడు ప్రజలు డబ్బులు చూడకపోయేది.. వారి వ్యక్తిత్వం చూసేవారు. గెలిచే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు.. అలాంటి వారు గెలిచిన తరువాత ప్రతిఫలం ఆశిస్తారని అన్నారు.  ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలించాలి. అసెంబ్లీ కి వెళ్లిన తరువాత అబద్దాలు మాట్లాడకుడదు.  నిజాయితీ గా ఉండాలని అన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ  నిజాయితీ ,నిబద్ధత పనిచేస్తాం.  తెలంగాణ ప్రజా సమితి నడిచిన  అలీ కాటేజీ నుండి మా జన సమితి  ప్రారంభమయ్యిoది. మన ఆలోచనలకు దగ్గట్టుగా మన ఆఫీస్ ఉంటుంది.  ప్రజల దగ్గర ఉండాలి కాబట్టి నాంపల్లి లో ఏర్పాటు చేసామన్నారు.  ఆఫీస్ ఉంటే అందరు ఆలోచనలను పంచుకోవచ్చు.  అన్ని ఉద్యమ కార్యచరణలు తెలంగాణ ప్రజా ఉద్యమాలకు ఈకార్యాలయం కేంద్రంగా ఉంటుందని వెల్లడించారు.  ప్రజా ఉద్యమాలకు హైద్రాబాద్ లో స్థానం లేదు.  ప్రజా ఉద్యమాల ఆఫీస్ ఇదని అన్నారు.  ప్రజా ఉద్యమాల సమాహారం తెలంగాణ జన సమితి.  న్యాయ సమ్మతమైన సమస్యలపై ఉద్యమాలు చేసే వారు రావచ్చు.  సభ్యత్వ నమోదు పుస్తకాలు ఉన్నాయి.  జూన్ 1 ధూమ్ ధామ్ కార్యక్రమం వుంటుందని అన్నారు. రైతు సమస్యల పై ఖమ్మం నుండి కరీంనగర్ కు వరకు సడక్ బంద్ కు మా మద్దతు వుంటుందని అన్నారు. రైతు బంద్ ఏమో కాని ఉన్న భూమి పోయింది. చాలా మందికి 4,000 అందలేదు. మన  నిర్మాణం బలంగా ఉంది.  హైదరాబాద్ లో  తెలంగాణ జన సమితి ఫేస్ బుక్ అకౌంట్ ఉంది.  పార్టీకి ట్విట్టర్ ఖాతా కూడా ఉందని అయన అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో  మేము అప్లికేషన్ కోరితే 500 మంది సర్పంచ్ అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. గ్రామ పంచాయతీ లకు స్వయం ప్రతిపత్తి కావాలని అనుకునే వారు అప్లికేషన్ చేయాలని సూచించారు. 

Related Posts