రావులపాలెం
కోనసీమజిల్లా రావులపాలెం ఎస్.బి.ఐ బ్యాంక్ లో అగ్నిప్రమాదం జరిగింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం సంబంధించినట్లు అగ్నిమాపక అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో సుమారుగా పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల కేవలం ఏసీలు, ఫ్యాన్లు, కంప్యూటర్లు ఫర్నిచర్ మాత్రమే అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. బ్యాంకు దగ్ధం అవడం వలన కష్టమర్లకు సంభందించిన రికార్డులు గాని లాకర్ రూముకు గాని లోన్లు సంబంధించిన వివరాలు ఏమీ దగ్ధం కాలేదు . కష్టమర్స్ ఆందోళన చెందనవసరం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు.