న్యూ ఢిల్లీ
సినీయర్ ఐసీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలి సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని అన్నారు. సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు కోర్టుకు తెలిపారు. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలి. రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని ఆదేశించింది.