హైదరాబాద్
బుధవారం నాడు న్న తెలంగాణ ప్రజలపై, రాష్ట్రంపై, ప్రభుత్వం విషం చిమ్మేలా... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయాలని, వ్యాపారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా డిల్లీ వేదికగా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలను అవమానపర్చే విదంగా విషం చిమ్మారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. నూకలు బుక్కుతవా అని అవమానించిన పియూష్ గోయల్ మన రాష్ట్రం కాదు, కానీ తెలంగాణ ప్రజల ఓట్లతో డిల్లీ గద్దెపై కూసొని తెలంగాణ ప్రజల్ని అవమానించేలా మాట్లాడారు కిషన్ రెడ్డిజ ఎప్.సి.ఐ పై సివిల్ సప్లైస్ విషయాలపై అవగాహన లేకుండా అబద్దాలు మాట్లాడారు కేంద్ర మంత్రి అని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్.సి.ఐ, కేంద్రానికి సంబందించిన బియ్యం రైస్ మిల్లులలో మాయమైందన్నారు కిషన్ రెడ్డి. సూటిగా అడుగుతున్న ఈ వడ్లకు మీరు డబ్బులిచ్చారా.. ఎప్.సిఐనుండి డబ్బులు ఎప్పుడస్తయి అవగాహన ఉందా.. ధాన్యం కొనుగోల్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో లోన్ తీసుకొని రైతుల వద్దనుండి ఎమ్మెస్పీకి వడ్లు కొనేది రాష్ట్రం, ఈ మిత్తి ఇబ్బందులు, డబ్బుల సర్దుబాటు రాష్ట్రం చేస్తుంది. ఇందులో కేంద్రం పాత్ర లేనేలేదు. వడ్లను బియ్యంగా మార్చి ఎప్.సి.ఐకు ఇచ్చాకే వాటికి సరిపడా డబ్బుల్ని 4నెలల తర్వాత ఇస్తుంది ఎప్.సి.ఐ మిల్లర్లపై దాడులు చేసే అధికారం ఎప్.సి.ఐకు ఉంది. ధాన్యం బస్తాలు మాయమయ్యాయనే ఆరోపణలపై వెరిఫికేషన్లో 4,53,000 బస్తాలు తక్కువన్నారు కదా... 2021లో యాసంగి, వానాకాలం కలిపి 40 కోట్ల 50 లక్షల బస్తాలను సేకరించాం.... ఇందులో మీరు చెప్పింది 0.001 శాతం అని అన్నారు. ఇది కూడా చాలా తప్పుడు సమాచారం, కొన్ని చోట్ల బాగులు చినిగి వడ్లు కింద పడుతాయి వాటిని లెక్కించలే... బాగులు కిందపడ్డవాటిని లెక్కించలే.. కామారెడ్డిలో 84,927 బస్తాలు కనబడట్లేదు అన్నారు, ఇది తప్పు అవి బియ్యం బస్తాలు. దీనిపై ఎప్.సి.ఐకి లేఖ కూడా రాసాం. సిద్దిపేట జిల్లాలో 64 బస్తాలు మాత్రమే తక్కువగా ఉంటే దానిని ఎఫ్ సిఐ 1,659 బస్తాలు తక్కువగా ఉన్నట్లు తమ నివేధికలో చూపించారు దీనిపైన లేఖ రాసాం. రైస్ మిల్లుల్లో ఉన్నప్పుడు అవి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం మాత్రమే.ఎప్.సి.ఐ గోదాములోకి వెల్లినప్పుడే అవి కేంద్రానికి చెందినవి. ఎక్కడైనా కొందరు మిల్లర్లు డిఫాల్ట్ ఐతే రాష్ట్ర ప్రభుత్వం నుండి ముక్కుపిండి వసూలు చేస్తాం. ప్యాక్టరీలో తయారైన సబ్బులు దొంగతనం ఐతే కస్టమర్ కు ఏం నష్టం. ప్రభుత్వ డబ్బంటే ప్రజల డబ్బు దాన్ని ఖచ్చితంగా సంరక్షిస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించి ఒక్క వడ్లగింజను సైతం వదిలేది లేదని అన్నారు. 2794 రైస్ మిల్లుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం, ఆర్ ఆర్ రికవరీ ఆక్ట్ ద్వారా ఇతర చట్టాల ప్రకారం రికవరీ చేస్తాం. కిషన్ రెడ్డి సివిల్ సప్లై మీద అవగాహన చేసుకోండి.బియ్యం మాయమైతే బారం రాష్ట్ర ప్రబుత్వంపై పడుతుంది, కేంద్రంపై కాదు, ఆ బియ్యాన్ని రికవరీ చేసే పటిష్ట చట్టాల్ని వాడుతున్నాం. 2794 మిల్లుల్లో 40 మిల్లుల్లో తక్కువున్నయి, అందులో రెండు మూడు బస్తాలు తక్కువున్న మిల్లులే ఎక్కువున్నయి.
గన్నీ బ్యాగుల ఆరోపణలపై మంత్రి మాట్లాడుతూ మా దగ్గర మూడు కోట్ల యాబై ఏడు లక్షల గన్నీబ్యాగులు సిద్దంగా ఉన్నాయి, చెక్ చేసుకోండి, ఎవరినైనా పంపండి ఈ బ్యాగులను మోస్తవా నువ్వు, ఎనిమిది కోట్ల గన్నీ బ్యాగులు అడిగితే 4 కోట్ల 45 లక్షలు ఇచ్చారు... మీరు తెలంగాణ ప్రజల ప్రతినిధే అయితే జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్ని అవసరమో అన్ని ఇప్పించాలి. మిగతావి జెమ్ పోర్ట్లల్లో తీసుకొమ్మన్నారు అక్కడ టెండర్లు అడిగితే ఒక్కడు రాలే. ఓపెన్ టెండర్లకు ఎందుకు అనుమతించరు....? అది కేంద్రం చేతుల్లోనే కదా ఉంది, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు.? కరోనాలో వెస్ట్ బెంగాల్కి వెల్లి గన్నీలు తెచ్చుకున్నప్పుడు ఎక్కడ పోయారు కిషన్ రెడ్డి? తెలంగాణ రైతులు భారతదేశంలో అంతర్భాగం కాదా.... ఏం తప్పుచేసామని వేదిస్తున్నారు. ఈ ఏడాది ప్రొక్యూర్మెంట్ స్టార్టయిన రోజు 15కోట్లు కావాలని చెప్పాం, 1.6 కోట్లు ఉన్నాయి. ఓల్డ్ గన్నీలను సేకరిస్తామన్నాం. ఐదురోజుల్లో 3.5కోట్ల గన్నీలను సేకరించాం. మరి మీదగ్గరే ఉన్న గన్నీలను తెప్పించే మనుసు మీకు లేదా.... తెలంగాణ బిడ్డ కాదా...? కానీ షార్టేజ్ కావాలని క్రియేట్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ప్రయత్నించడం నీచం, దేశం మొత్తం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటే మీకు కన్ను కుడుతుందని అన్నారు.