తిరుపతి, ఏప్రిల్ 21,
ఏపీ మంత్రి ఆర్‌కే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలోని ఎస్వీయూ ఆవరణలో ఆలయానికి వెళ్లారు రోజా. ఇదే సమయంలో మంత్రి ఫోన్ కొట్టేశాడు ఓ దొంగ. శాప్ సమావేశంలో ఉన్న సమయంలో సెల్ ఫోన్ల గురించి రోజా వివరిస్తున్న సమయంలో ఫోన్ చోరీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ట్రాకింగ్ ద్వారా ఫోన్ దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి అయ్యాక తొలి మీటింగ్ తిరుపతిలో నిర్వహించారు రోజా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌కు హాజరైన రోజాకి అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతకముందు ఆమె స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఫైర్ బ్రాండ్ రోజా తన ఫైర్ వెనుక కారణం ఏంటనేది బయట పెట్టారు. ఫైర్ అనేది ఇన్ బిల్ట్ అని.. చెడు మీద ఫైర్ అదే విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చారు. జగనన్న మాదిరిగానే.. మాటలు తక్కువ పని ఎక్కువగా చేసుకుంటూ పోతానన్నారు మంత్రి ఆర్కే రోజా.