YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేటీఆర్ కు ఫ్రస్టేషన్‌

కేటీఆర్ కు ఫ్రస్టేషన్‌

హైదరాబాద్, ఏప్రిల్ 21,
కేటీఆర్ ఫ్రస్టేషన్‌తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ వచ్చేలా మాట్లాడారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల పైచిలుకు ఇస్తే.. ఒక కోటి ఆరవై లక్షలు మాత్రమే తెలంగాణకు ఇచ్చిందని టీఆర్ఎస్‌ నేతలు వ్యాఖ్యానించడం ఏంటని, అవి టీఆర్‌ఎస్, బీజేపీ పైసలు కాదు..ప్రజలు కట్టిన టాక్స్ లు.. అని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది తిట్ల పురాణం రాజకీయం ఏంటి…? ఆయన ప్రశ్నించారు. 111 జీవోపై 2016 లో హైపవర్ కమిటీ ని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ రిపోర్ట్ 31 మార్చి 2022 రిపోర్ట్ ఇచ్చినట్టు జీవో తెలిపారన్నారు.ఆ రిపోర్ట్ లో పొందుపరిచిన అంశాలు బహిర్గత పరచాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండు జలాశయాలు మరో హుస్సేన్ సాగర్ గా మరే ప్రమాదం ఉందని, ఆగమేఘాల మీద 111 జీవో ఎత్తేసి అక్కడ ఉన్న జలాశయాలు, పర్యావరణాన్ని కాపాడేలా కమిటీ ఏర్పాటు చేయడం ఏంటని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ద్వారా చైనా కంపెనీలకు కట్టబెడుతున్నారని, హీరో ఎలక్ట్రిక్ సంస్థ 400 కోట్ల ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇండియా లో తయారు చేసినట్టు ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.బ్రేన్లైన్ ఇండియా అనే కంపనీ నిబంధనలకు వ్యతిరేకంగా 75 కోట్లను సబ్సిడీ ద్వారా దోచుకు తింటున్నారని, ఒక స్కూటర్ బ్రేన్లైన్ కంపెనీకి 25 వేల రాయితీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇండియాలోనే స్కూటర్ తయారు చేస్తున్నామని సబ్సిడీ తీసుకొస్తు 100 శాతం బయట నుండి కొనుగోలు చేస్తోందన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన వెల్లడించారు.

Related Posts