YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ నే తారక మంత్రం...

తెలంగాణ నే తారక మంత్రం...

హైదరాబాద్, ఏప్రిల్ 22,
తెలంగాణ రాష్ట్ర సమితి... ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారంలో ఉన్న పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నుంచి ఎన్నిక ఏదైనా, ఎప్పుడైనా మాదే విజయం అంటూ ఘనంగా చెప్పుకుంటూ వస్తున్న పార్టీ. ఆ పార్టీ ధీమాకు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఎలాటి ఢోకా లేకుండా పోయింది. అయితే ఆ తరువాత నుంచి రాష్ట్రంలో తెరాస కు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయనడానికి పలు ఎన్నికల ఫలితాలు సాక్షీభూతాలుగా నిలిచాయి. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తరువాత తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలలో తెరాస పరాజయంతో ఆ పార్టీకి రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు గూడుకట్టకుంటున్నాయన్న అనుమానాలు పొడసూపుతున్నాయి ఇటువంటి ఒడుదుడుకులను ఎదుర్కొనడానికి తెరాసకు ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఒకే ఒక్క మంత్రం ‘తెలంగాణ సెంటి మెంట్’ 2014 ఎన్నికలలో ఆంధ్రపాలకులు, వలస పాలన అంటూ  స్థానికులలో ఆంధ్ర వ్యతిరేకతనుప్రేరేపించి లబ్ధి పొందితే.... తీసుకుంటే 2018 లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా అన్నసందేహాన్ని జనంలో కలిగిచి  మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే  మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమేనంటూ...తెలంగాణ సెంటిమెంట్  రెచ్చగొట్టింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన ఎనిమిదేళ్ల తరవాత కూడా మరో సారి అధికారంలోకి రావాలంటే తెరాసకు ‘తెలంగాణ సెంటిమెంట్’ తప్ప మరో ఆధారపడగలిగే నినాదం కనిపించని పరిస్థితి ఉందని నిన్న వరంగల్ పర్యటనలో కేటీఆర్ ఉద్రేక పూరిత, ఉద్వేగ భరిత ప్రసంగాన్ని బట్టి అవగతమౌతుంది.  ఇంతకీ వరంగల్ సభలో ఆయన ఏం చెప్పారు. మరో సారి కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారు అన్న సందేశాన్ని జనాలకు ఇచ్చారు. నేరుగా ఇవే మాటలు అనకుండా బిట్వీన్ ది లైన్స్  అదే అర్ధం వచ్చేలా మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనలో ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగిందని మోడీ అన్నారంటూ కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను  టచ్ చేశారు. గత రెండు ఎన్నికలలో కేసీఆర్ కూ, టీఆర్ఎస్ కూ కలిసి వచ్చిన ‘సెంటిమెంట్’ మంత్రం ఈ సారి పారే అవకాశాలపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఎనిమిదేళ్లలో తెరాస పోకడలను అర్ధం చేసుకున్న జనం కేవలం సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని వారు విశ్లేషిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు వంటి నీళ్లు, నియామకాల నినాదాన్ని పూర్వ పక్షం చేసి...కొలువుల జాతరను కేవలం ప్రకటనలకే పరిమితం చేసిన తెరాస పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతను ‘సెంటిమెంట్’ చల్లారుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

Related Posts