చౌటుప్పల్
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా పై కెటిఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై కెటిఆర్ దిష్టిబొమ్మ ను దహనం చేశారు బీజేపీ నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అహంకారం తో కెటిఆర్ మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోకపోతే బీజేపీ కార్యకర్తలు కూడా అదే తీరులో సమాధానం చెప్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కనీసం కారు లో పెట్రోలు కు కూడా డబ్బులు లేని కెటిఆర్ కు లక్షల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.