విజయవడ
కృష్ణా జిల్లా పామర్రు దిగమర్రు జాతీయ రహదారి 4 వరుసలు విస్తరణలో భాగంగా కైకలూరు మండలం ఆలపాడు పంచాయతీ పరిధిలోని సోమేశ్వరం వద్ద రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగుతుంది.ఈ క్రమంలో బుధవారం సిబ్బంది పిల్లర్ల పై నాలుగు నిలువు వరుసల్లో సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేయగా అర్ధరాత్రి సమయంలో విరిగి పడిపోయింది.ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.సిమెంట్ దిమ్మలు పడిపోవటానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఫ్లైఓవర్ నిర్మాణ సిబ్బంది సంఘటనా స్థలం చుట్టూ పరదాలు కట్టి లోనికి ఎవరినీ అనుమతించడం లేదు.