YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య దుమారం

బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య దుమారం

న్యూఢిల్లీ, ఏప్రిల్  22,
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య దుమారం కొనసాగుతూనే ఉంది. కమలం వర్సెస్‌ గులాబీ పార్టీ మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. సాయి గణేష్‌ ఆత్మహత్యపై.. సీబీఐ విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపుల వల్లే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై సీబీఐ విచారణ జరపించాలని తెలంగాణ బీజేపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రానికి చెందిన దర్యాప్తు సంస్థల దర్యాప్తుతో బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం లేదని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.మంత్రి వేధింపుల కారణంగానే తోనే సాయిగణేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని.. కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. సాయి గణేశ్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.సాయి గణేష్ మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నాయి. అతని కుటుంబాన్ని ఈ మధ్యాహ్నం పరామర్శించనున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఇప్పటికే కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సాయి కుటుంబాన్ని ఓదార్చారు. హోం మంత్రి అమిత్ షా.. స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఇదే అంశంపై రాష్ట్ర బీజేప నేతలు గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పువ్వాడకు నోటీసులు
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారం హైకోర్టుకు చేరింది… పోలీసుల వేధింపులు తాళలేకే సాయి గణేష్ ఆత్మహత్య చేస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు పిటిషనర్‌ తరపు న్యాయవాది అభినవ్‌.. ఇక, ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు మొత్తం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. ఇక, ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది…అయితే, సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు సాగుతోందని హైకోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందన్నారు.. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.. ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. మంత్రి పువ్వాడతో పాటు మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేయడంతో పాటు.. కౌంటర్‌ దాఖలు ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ.. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సాయి గణేష్‌.. పోలీసుల వేధింపులు, మంత్రి పువ్వాడ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే.. ఇక, అతడి పరిస్థితి విషమించడంతో.. ఖమ్మం నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. సాయి గణేష్ మృతిచెందాడు.. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది..

Related Posts