గుడివాడ
కృష్ణా జిల్లా గుడివాడలో మట్టిని అక్ర మంగా తరలించే మాఫియా దారుణా నికి తెగబడింది.మట్టి తరలింపును అడ్డుకునేందుకు యత్నించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏకంగా జేసీబీతో కొట్టి హత్య చేసేందుకు యత్నించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ఐపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గుడివాడ పరిధి లో గత కొంతకాలంగా అధికార పార్టీ నేతల అండతో మట్టి అక్రమ తరలింపు భారీగా జరు గుతోందన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి.దీనిపై సమా చారం అందుకున్న ఆర్ఐ అరవింద్ ఈ దందాను అడ్డు కునేందు కు తన సిబ్బందితో కలిసి వెళ్లారు.అరవింద్ యత్నాలను అడ్డు కున్న మట్టి మాఫియా ఆయనపై దాడికి దిగింది.ఈ క్రమంలో జేసీబీతో నెట్టి ఆయనను హత్య చేసేందుకు మాఫి యా యత్నించింది. అయితే జేసీబీ నుంచి పక్కకు తప్పుకున్న అరవింద్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.