బాపులపాడు
ఏలూరు జిల్లాలో పర్యటించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన వెళుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బాపులపాడు మండలం కోడూరుపాడు , హనుమాన్ జంక్షన్ సమీపంలో వేలేరు అడ్డరోడ్డు వద్ద జన సైనికులు ఘన స్వాగతం పలికారు. అభిమానులు, జన సైనికులు పవన్ పై పుష్పాలు జల్లడంతో పవన్ భయటకు వచ్చి అభివాదం చేశారు. అనంతరం చింతలపూడి, లింగపాలెంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు.