పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో భారీ లేవి బియ్యం కుంభకోణం కలకలం రేపింది. ఐదు కోట్ల మేరకు కుంభకోణం జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద రైసుమిల్లు కు వడ్లు ఇచ్చింది. వాటిని బియ్యంగా మార్చి ఎఫ్సీఐకు పంపాల్సిన మిల్లర్ నిబంధనలకు వ్యతిరేకంగా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. లెవీ బియ్యంపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టగా సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని లక్ష్మీనరసింహ ఇండస్ట్రీ కు పౌరసరఫరాల శాఖ 91,258 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించింది. మొత్తానికి 5,95,98,278 రూపాయల విలువ గల 21,100 కుంటాల బియ్యం మాయం చేసినట్లు గుర్తించారు. ఎఫ్ సి ఐ కి లెవీ పెట్టాల్సిన బియ్యాన్ని సదరు మిల్లర్ బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు గుర్తించారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పెద్దపల్లి జిల్లాలోని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తేఇలాంట కుంభకోణాలు మరిన్ని బహిర్గతం అయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలోని మిల్లర్లు లెవీ బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు సమాచారం.