అమరావతి ఏప్రిల్ 23
నగదు బదిలీ విషయంలో ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. నగదు బదిలీ పథకాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ప్రకటించారు. మంత్రి అధ్యక్షతన శుక్రవారం పౌరసరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే నగదు బదిలీ పథకాన్ని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యాప్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ నిర్ణయమని, తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు వెల్లడి చేస్తామని ఆయన తెలిపారు.రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా, సకాలంలోనే డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చే బియ్యం నాణ్యతలో రాజీ ఉండదని, అలాంటి చర్యలే తీసుకుంటున్నామని అన్నారు. రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, జిల్లాను యూనిట్
కేంద్రంగా తీసుకొని చేస్తామని పేర్కొన్నారు.