సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మూవీ నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కు భారీ స్పందన వస్తుంది. ఈ రోజు చిత్ర యూనిట్ 'సర్కారు వారి పాట' నుంచి మూడవ సింగల్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ తనదైన శైలిలో ఫాస్ట్ పేస్డ్ బీట్ తో ఈ టైటిల్ సాంగ్ ని అదరగొట్టారు. పాట మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఫుల్ ఎనర్జీటిక్ అండ్ యంగేజింగా వుంది. సినిమాలో మహేశ్‌బాబు పాత్రని వర్ణించే పాట ఇది. అనంత్ శ్రీరామ్ రాసిన ''ఆయుధాలు లేని వేట, రివర్స్ లేని బాట''అనే మాటలు సర్కారు వారి పాటలో మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాయి. హారిక నారాయణ్ హై పిచ్ లో పాడిన విధానం టైటిల్ సాంగ్ కి సరిగ్గా సరిపోయింది. ఈ పాటలో మహేష్ బాబు పూర్తిగా యాక్షన్ లుక్స్ లో కనిపించి అలరించారు. మొదటి రెండు పాటల్లాగే ఈ టైటిల్ ట్రాక్ కూడా చార్ట్ బస్టర్ లిస్టు లో చేరింది.
కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.