హైదరాబాద్, ఏప్రిల్ 23,
జీవితా రాజశేఖర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చిత్తూరు జిల్లా నగరి కోర్టు.. జ్యోస్టర్ ఎండీ హేమ… జీవితపై ఫిర్యాదు చేశారు… ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని జీవితారాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు.. ఆమె తనకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని హేమ చెబుతున్నారు. రూ.26 కోట్లు ఎగ్గొట్టారని జీవితారాజశేఖర్‌పై హేమ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే కాగా.. ఈ వ్యవహారం కోర్టు వరకు చేరింది.. ఇవాళ నగరి జేఎఫ్‌సీఎం కోర్టు.. జీవితా రాజశేఖర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.. అయితే, జీవితా రాజశేఖర్ ఆరోగ్యం సరిగా లేదని మెడికల్ రికార్డులను వాళ్ల తరపు న్యాయవాది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.. అయితే, జీవితా రాజశేఖర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నగరి కోర్టు.. సదరు పిటిషన్ పై తదుపరి విచారణను మే 11వ తేదీకి వాయిదా వేసింది.