సుర్యాపేట
సూర్యాపేట జిల్లా కోదాడలో బిఎస్పీ బహుజన ఘీంకారం మహా సభ నిర్వహించారు. సభ నుద్దేశించి ఆ పార్టీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎందరో పోరాట వీరులును సమాజానికి అందించిన గడ్డ కోదాడ, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కాన్షిరం వంటి నాయకుల పోరాట స్ఫూర్తితో పోరాటం చేస్తామన్నారు . కేటీఆర్ ఒక పిట్ట పిల్ల తండ్రి ఇచ్చిన మాటలను ట్విట్టర్ లో పెట్టి ట్విట్టర్ పిట్ట అంటూ ఫైర్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ కార్యకర్తలు బిఎస్పీ సభలో పాల్గొని బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంటికి నిద్రల లేకుండా చేస్తున్నారు. ప్రజల మార్పుకి ఇదే సూచన. బిసి, ఎస్సి, ఎస్టీ ప్రజలను ఇంతకాలం పాలించిన పార్టీలు వెనక్కి నెట్టాయి, బలహీనపరచి బలహీనవర్గాలుగా చేశాయి. బానిసలుగా మార్చాయని .టీఆర్ఎస్ అంటే కబ్జా, అవినీతి, దోపిడీ, కమీషన్ల పార్టీ, బీజేపీ అంటే మతకల్లోల పార్టీ ఇద్దరు ప్రజలను మోసం చేయడం కొరకు ఒకరికొకరు తిట్టుకొంటున్నారు. దొందు దొందే దొంగల పార్టీలు అన్నారు. ఆయా పార్టీల్లో ఎస్సి, ఎస్టీ, బిసి సెల్ అంటు బహుజనులు బంధించి బానిసలుగా మారుస్తున్నాయ్ వారి ఆటలు తెలుసుకొని బయటకు రండి మన పార్టీ బిఎస్పీఅని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియ యూనివర్సిటీ కి వెళ్లి నాడు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులను కాపాడడం కోసం పనిచేసిన వ్యక్తి ఆర్ఎస్పీ. ఉద్యమం సమయంలో ఫార్మ్ హౌస్ లో కూర్చొని విద్యార్థుల బలికి కారణం అయ్యారు. నన్ను విమర్శించే హక్కు కేసీఆర్, కేటీఆర్ కి లేదన్నారు. బిఎస్పీ పార్టీ రానున్న ఎన్నికల్లో 70 సెట్లు బిఎస్పీ ఇస్తున్నాం దమ్ముంటే కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు బిసిలకు 70 సీట్లు ఇవ్వాలి సవాల్ విసిరారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒక్కటే అందుకే ఇద్దరికి ఉమ్మడి ఎన్నికల వ్యూహకర్తగా పీకే ను పెట్టుకున్నారు. అధికారం శాశ్వితంగా వాళ్ళ వద్దనే ఉండేందుకు పన్నిన కుట్ర ఇదియన్నారు. కేసీఆర్ బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో అధిక శాతం నీ ఫార్మ్ హౌస్ అభివృద్ధి కొరకు కాపాడుకోవడం కేటాయించారు హైదరాబాద్ నుండి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ వరకు హైపవర్ సీసీ కెమెరాలు పెట్టు ప్రజల కదలికలు పసిగట్టు ప్రశ్నినిస్తే కేసులు పెడుతున్నారు. కొండచిలువలకు, చీమలు జరుగుతున్న యుద్ధం, కార్ కి ఏనుగుకి జరుగుతున్న యుద్ధం.ఒక్క సంవత్సరం ఆగండి సంతోషకరమైన మన పాలన రాబోతోంది, కల్లుగీత కార్మికులు, కుమ్మరిలు, చెప్పులు కుట్టే, ఎరుకుల మొదలగు అన్ని వర్గాల వారిని అసెంబ్లీకి పంపిస్తుంది బిఎస్పీ పార్టీ అని అన్నారు.