పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పొగాకు ధరలపై సీఎంవో అధికారులతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ పొగాకు ధరలపై అవసరమైతే కేంద్రమంత్రితో చర్చించాలని ఆదేశించారు. పొగాకు ధరల పతనంపై మీడియాలో కథనాలపై అయన స్పందించారు. మార్కెట్లో పంటల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని అధికారులను సూచించారు. కందులు, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలన్నారు. ఈ సందర్బంగా తాము పొగాకు బోర్డు అధికారులతో జరిపి చర్చ సారాంశాన్ని సీఎం కు అధికారులు వివరించారు. మార్కెట్ లో పంటల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అయన ఆదేశించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్కు రూ.500కోట్లు విడుదల చేశామన్నారు. కందులు, మొక్కజొన్న రైతులను ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.