పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా పాడేరులో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రజల మీద నిరంతరం ధరల భారాన్ని పెంచుతూ ప్రజలని బాధకు గురి చేస్తూ కార్పొరేట్ సంస్థల కి తొత్తులుగా వ్యవహరిస్తుందన్నారు.దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుల పై అధిక భారాన్ని మోపుతుందని. అన్నింటి మీద జిఎస్టి పెట్టినప్పుడు పెట్రోల్ డీజిల్ మీద పెట్టకుండా అంబానీ లాంటి కార్పోరేట్ వ్యక్తులకు ఊడిగం కి పాల్పడుతుందని. దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పడుతున్నప్పటికీ బిజెపి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా దేశ సంపదను కొల్లగొట్టడం ద్యేయంగా పరిపాలన అవలంబిస్తోందని కార్పొరేట్ సంస్థల కి ప్రైవేట్ కంపెనీలకు జాతీయస్థాయి సంస్థలని వేలం వేసి అమ్మెస్తున్నదని అన్నారు. దేశ భవిష్యత్తును కాపాడాలని ఉంటే కచ్చితంగా బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడం తప్పదని అన్నారు. సిపిఎం మండల కార్యదర్శి సుందర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక వైపు రోజురోజుకీ ధరలు పెంచుతూ పోతుంటే రాష్ట్రప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంపు,ఆస్తిపన్నులని, నీటిమీద పన్నులని,చెత్త మీద పన్నులని ప్రతి దాని మీద పన్నులు పెంచుకుంటూ సామాన్యుని బ్రతకడమే కష్టంగా మారిందని పేదవాడు బ్రతడమే నేరంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్షాలు పెద్దఎత్తున ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు నిర్మిస్తుందని ప్రజల పక్షాన ఎర్రజెండా నిలబడి పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు జల్లి రాజబాబు, గొంతి నూకి నాయుడు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమర్, ఏఐవైఎఫ్ నాయకులు లక్ష్మణ్, గిరిజన సంఘం అల్లూరు జిల్లా కార్యదర్శి కే నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అలానే మినుములూరు లో నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పి వామపక్షాలైన సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిమలమ్మ,వసంత,వరలక్ష్మి,కొండబాబు తదితరులు పాల్గొన్నారు.