ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పట్టణంలో 10 వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని, విద్యార్థులకు ఏబీవీపీ తరుపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారుతి అన్నారు.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని , అలాగే కొన్ని పాఠశాలలలో విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా నిర్భయంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పరీక్షలు నిర్వహించే అధికారులు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు గురి కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అన్ని పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులకు రవాణా సౌకర్యం, పరీక్ష కేంద్రాలలో మంచినీటి సౌకర్యం లేదా శీతల పానీయాలు ఏర్పాటు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థినీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు పరీక్ష కేంద్రాలలో చల్లగా ఉండే విదంగా మరియు కరోనా నియమ నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి అనారోగ్యానికి గురైన వారికి ప్రథమ చికిత్స అందించే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.