హైదరాబాద్, ఏప్రిల్ 25,
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంలో ఆలస్యమైనందుకు బేషరతుగా క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్. పాలనాపరమైన కారణాలతో ఈడీకీ సమాచారం ఇవ్వడం ఆలస్యమైందని కోర్టుకి విన్నవించుకున్నారాయన. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమంటూ.. కోర్టు దిక్కరణ కేసు కొట్టివేయాలని వేడుకున్నారు. కోర్టు దిక్కరణ పిటిషన్‌లో వాదనలకు కొంత సమయం కోరింది ఈడీ. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వివరాలు ఆదేశాల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలని కోరింది. అయితే విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామంది హైకోర్ట్.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్- ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కోరారు. ఈడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సర్ఫరాజ్ ఆహ్మద్.. మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చామని పేర్కొన్నారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలతోపాటు.. కెల్విన్ కేసులో సేకరించిన వాట్సప్ స్క్రీన్ షాట్లు ఈడీకి ఇచ్చామని తెలిపారు. నిందితుల నుంచి కాల్‌డేటా రికార్డులను దర్యాపు అధికారులు సేకరించలేదన్న సర్ఫరాజ్ అహ్మద్.. సిట్ సేకరించిన 12 మంది కాల్‌డేటా,వీడియో రికార్డుంగులను ఈడీకి ఇచ్చామని చెప్పారు. కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదన్నారు. పాలనాపరమైన కారణాలతో ఈడీకి సమాచారమివ్వడం ఆలస్యమైందని పేర్కొన్నారు.హైకోర్టు ఆదేశాల అమలులో ఆలస్యం జరిగినందున ఎక్సైజ్ డైరెక్టర్ ఉన్నత న్యాయస్థానాన్ని బేషరతుగా క్షమాపణలు కోరారు. ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్ధమని తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో వాదనలకు సమయం కోరిన ఈడీ.. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వివరాలు హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపింది. ఆనంతరం విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.