తిరుమల, ఏప్రిల్ 26,
కలియుగ వైకుంఠం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తిరుమల శ్రీవారి హుండి గలగలలాడుతోంది. కోవిడ్ కారణంగా ఏడాదిగా తగ్గిన స్వామి వారి ఆదాయం… అంచనాలకు మించి పెరుగుతోంది. ఈ మాసంలో ఇప్పటికే 90 కోట్లు దాటగా… నెలాఖరుకు వందకోట్లు అవుతుందని ఆంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమాని 2020లో హుండీ ఆదాయం రూ.700 కోట్లే. కానీ 2021లో హుండీ ఆదాయం రూ.900 కోట్లకు పెరగడంతో టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.128 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్‌లో ఇప్పటివరకూ 100 కోట్లకు పైగానే హుండీ ఆదాయం లభించింది. అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవారి దర్శనార్దం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటే స్వామి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఏడు కొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2020 వరకు పెరుగుతూ వచ్చిన ఆదాయం… ఆ తర్వాత కరోనా కారణంగా తగ్గిపోయింది. 80 రోజులు పాటు దర్శనాలు నిలివేశాక… తర్వాత కూడా పరిమితంగానే భక్తుల్ని అనుమతించారు. దీనివల్ల 2020 సంవత్సరానికి 13 వందల కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని అనుకుంటే…, ఏడువందల కోట్ల వరకు తగ్గిపోయింది. 2021లో కూడా 900 కోట్లు మాత్రమే వచ్చింది.కోవిడ్ తీవ్రత తగ్గడంతో శ్రీవారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సాధారణంగా ఒక రోజుకు శ్రీవారికి 3 కోట్లు వరకు హుండీ ఆదాయం వస్తుంది. గత మార్చిలో 128 కోట్ల రూపాయల కానుకలు వచ్చాయి. ఇక ఏప్రిల్ మాసంలో కూడా 21 రోజులకు 90 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల చివరి నాటికి 120 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి గతంలో మాదిరిగా శ్రీవారి పై కాసుల వర్షం కురుస్తుండడంపై టీటీడీ సంతోషం వ్యక్తం చేస్తోంది.తిరుమలకు గతంతో పోలిస్గే భక్తుల రద్దీ తగ్గింది. 3 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు 67,437 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 29,440 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లుగా టీటీడీ పేర్కొంది. సరాసరిన ఈ మధ్యకాలంలో 4 కోట్లకు పైనే ప్రతిరోజూ ఆదాయం లభిస్తోంది