YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎయిడ్స్ వ్యాప్తిలో ఆంధ్ర ఫస్ట్

ఎయిడ్స్ వ్యాప్తిలో  ఆంధ్ర ఫస్ట్

విజయవా, ఏప్రిల్ 26
దేశవ్యాప్తంగా నమోదైన హ్యుమన్ ఇమ్యునోడెఫిసియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్ఏసీఓ) సమాధానం చెప్పింది. ఎన్ఏసీఓ తెలిపిన వివరాల మేరకు భారతదేశంలో గడిచిన పదేళ్ల (2011- 21)లో అసురక్షిత సంభోగం కారణంగా దేశవ్యాప్తంగా 17 లక్షల మందికి పైగా HIV బారినపడినట్టు జాతీయ ఎన్ఏసీఓ వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 3.18 లక్షల మంది హెచ్ఐవీ బారినపడినట్లు పేర్కొంది. ఈ దశాబ్ద కాలంలో హెచ్ఐవీ బారిన పడిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు ఎన్ఏసీఓ తెలిపింది. 2011 - 12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవీ సోకగా.. ఆ సంఖ్య 2020-21 నాటికి 85,268కి తగ్గిందని తెలిపింది. లైంగిక సంపర్కం సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా భారత్‌లో గత పదేళ్లలో (2011-21) 17,08,777 మందికి హెచ్ఐవీ సోకిందని పేర్కొంది.రాష్ట్రాల పరంగా చూస్తే.. అసురక్షిత సంభోగం కారణంగా దేశంలోనే అత్యధిక హెచ్ఐవీ కేసులు ఆంధ్రప్రదేశ్ నమోదయ్యాయి. గత పదేళ్లలో కండోమ్ వాడకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,18,814 మందికి హెచ్ఐవీ సోకింది.
మహారాష్ట్ర - 2,84,577 హెచ్ఐవీ కేసులు
కర్ణాటక - 2,12,982
తమిళనాడు - 1,16,53
ఉత్తరప్రదేశ్ - 1,10,911
గుజరాత్ - 87,440 రాష్ట్రాల్లో అత్యధికంగా హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి.ఇక, 2011-21 వరకు రక్త మార్పిడి, ఇతర సంబంధిత కారణాలతో 15,782 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. 2011-21 మధ్య 4,423 మంది చిన్నారులకు తల్లుల నుంచి హెచ్ఐవీ సోకింది.కాగా, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హెచ్ఐవీ కేసులు స్థిరంగా తగ్గుతున్నాయి. 2020 నాటికి దేశవ్యాప్తంగా 23,18,737 మంది హెచ్ఐవీతో జీవిస్తున్నారు. వీరిలో 81,430 మంది చిన్నారులు ఉండటం గమనార్హం.హెచ్ఐవీ టెస్టుకు ముందు.. తర్వాత చేసే కౌన్సిలింగ్ రోగులు చెప్పిన వివరాల ఆధారంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఈ లెక్కలు వేసింది. ఎయిడ్స్ విషయంలో భారత్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ట్రీట్మెంట్ సులువుగా లభించడం వల్ల దేశంలో ఎయిడ్స్ రోగుల పరిస్థితి మెరుగైందని.. 2000 తర్వాత నుంచి దేశంలో హెచ్ఐవీ సోకిన రోగుల సంఖ్య తగ్గుతోందని చెబుతున్నారు.ఇక, హెచ్ఐవీ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందితో శృంగారం, కలుషిత రక్తమార్పిడి, కలుషిత సిరింజిలను వాడడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. హ్యుమన్ ఇమ్యునోడెఫిసియెన్సీ (హెచ్ఐవీ) వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. తర్వాత, అక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్)గా రూపాంతరం చెందుతుంది. ఎయిడ్స్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మనిషి క్రమంగా క్షీణించి, తర్వాత చనిపోతారు.1981లో అమెరికాలోని ఓ వ్యక్తికి మొదటి సారిగా హెచ్ఐవీ వ్యాధి లక్షణాలు గుర్తించారు. ఈ వ్యాధిని కనిపెట్టడానికి కొంత సమయం పట్టినా.. కనిపెట్టాక, ఈ సమస్య చాలా మందికి ఉందని తేలింది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. హెచ్ఐవీ సోకిన మొదటిసారి వ్యాధి ఓ వైద్యుడు కావడం  గమనార్హం..

Related Posts