YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

అమెరికా, చైనా తర్వాతే భారత్...

అమెరికా, చైనా తర్వాతే భారత్...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26,
గతేడాది ప్రపంచ రక్షణ రంగ వ్యయం రికార్డుస్థాయిలో ఉన్నట్టు అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. 2021లో ప్రపంచ సైనిక వ్యయం 2.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ జాబితాలో అమెరికా, చైనా తర్వాత భారత్‌ అత్యధికంగా ఖర్చు చేసిన దేశంగా నిలవడం విశేషం. ‘‘2021లో ప్రపంచ సైనిక వ్యయం 0.7 శాతం మేర పెరిగి 2113 బిలియన్ డాలర్లకు చేరుకుంది.. అత్యధికంగా అమెరికా, చైనా, భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా ఈ ఐదు దేశాలు ఖర్చు చేశాయి.. ప్రపంచ మొత్తం వ్యయంలో ఈ దేశాల వాటా 62 శాతం’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.‘‘కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక పతనం ఉన్నా ప్రపంచ సైనిక వ్యయం గరిష్ట స్థాయికి చేరింది’’ అని సిప్రీ సైనిక వ్యయం, ఆయుధ ఉత్పత్తి కార్యక్రమం సీనియర్ రిసెర్చర్ డాక్టర్ డియోగో లోపేజ్ డ సిల్వా అన్నారు. ‘‘ద్రవ్యోల్భణం కారణంగా రియల్-టర్మ్ వృద్ధి రేటులో మందగమనం ఉంది.. నామమాత్రంగా అయితే సైనిక వ్యయం 6.1 శాతం పెరిగింది’’ అని వ్యాఖ్యానించారు.కోవిడ్-19 మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకున్న కారణంగాప్రపంచ జీడీపీలో రక్షణ వ్యయం 2.2 శాతానికి చేరుకుంది.. 2020లో ఇది 2.3 శాతంగా ఉంది. ‘‘అమెరికా రక్షణ వ్యయం 2021లో 801 బిలియన్ డాలర్లకు చేరుకుంది.. 2020తో పోల్చితే ఇది 1.4 శాతం తక్కువ.. 2012 నుంచి 2021 మధ్య కాలంలో సైనిక పరిశోధన, అభివృద్ధికి నిధులను అగ్రరాజ్యం 24 శాతం పెంచింది.. ఆయుధాల కొనుగోళ్లపై 6.4 శాతం ఖర్చు తగ్గించింది’’ అని సిప్రీ తెలిపింది.రెండో స్థానంలో ఉన్న చైనా సైనిక వ్యయం గతేడాది 293 బిలియన్ అమెరికన్ డాలర్లు కాగా.. 2020తో పోల్చితే ఇది 4.7 శాతం అధికం.. మూడో స్థానంలో ఉన్న భారత్ 76.6 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది.. 2020తో పోల్చితే ఇది 0.9 శాతం అధికం’ అని పేర్కొంది. సిప్రీ ప్రకారం.. ‘‘ప్రపంచ రక్షణ వ్యయంలో మూడో స్థానంలో నిలిచిన భారత్ 76.6 బిలియన్ డాలర్లు (5.28 లక్షల కోట్లు).. 2020 కంటే ఇది 0.9 శాతం అధికం.. ఇది 2012 కేటాయింపుల కంటే 33 శాతం అధికం’’ అని చెప్పింది.స్వదేశీ పరిశ్రమను బలోపేతం చేయడానికి 2021 సైనిక బడ్జెట్‌లో 64 శాతం మూలధన వ్యయం దేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు భారత్ కేటాయించింది. బ్రిటన్ గతేడాది రక్షణ రంగానికి 68.4 బిలియన్ డాలర్లు కేటాయించింది.. అంతకు ముందు ఏడాది 2020 కంటే ఇది మూడు శాతం అధికం.రష్యా తన సైనిక వ్యయాన్ని 2021లో 2.9 శాతం మేర పెంచి 65.09 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా సైన్యాలను మోహరించింది.. వరుసగా మూడో ఏడాది మాస్కో రక్షణ వ్యయం వృద్ధి చెందింది.. 2021లో రష్యా జిడిపిలో ఈ వ్యయం 4.1 శాతానికి చేరుకుంది’’ అని తెలిపింది. అధిక ఇంధన ధరలు గతేడాది రష్యా సైనిక వ్యయం పెంచడానికి దోహదపడ్డాయని సిప్రీ సైనిక వ్యయం, ఆయుధ ఉత్పత్తి కార్యక్రమం డైరెక్టర్ లూసీ బెరాడ్ సూడ్రే అన్నారు.

Related Posts