YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు : కుమారస్వామి

ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు : కుమారస్వామి

కర్నాటక గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. గురువారం నాడు  ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ  బీజేపీకు మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు.  మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.  ఎమ్మెల్యేలను బెదిరిస్తున్న సంగతి నాకు తెలుసు. తనపై కేంద్రప్రభుత్వం ఈడీని ఉసిగొల్పుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ నాతో చెప్పారు. తనపై ఈడీ కేసు ఉందనీ.. వాళ్లు తనకు ఉచ్చు బిగించనున్నారని ఆయన చెప్పారు.మా ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవడమే మా తక్షణ కర్తవ్యమన్నారు. విపక్ష పార్టీలన్ని ఏకతాటిపై వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని  కుమారస్వామి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య  వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందనీ.. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై అన్ని ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని తన తండ్రి  దేవెగౌడను కోరతానన్నారు.  బీజేపీపై పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, టీఆర్ఎస్ నేత కేసీఆర్ కుబిఆ తమకు సహకరించాలని జేడీఎస్ నేత కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ఐకమత్యంతో పోరాడాల్సిన సమయం వచ్చిందని, తమ పోరాటానికి కలసి రావాలని ఆయన వ్యాఖ్యానించారు.  కాగా, ఇటీవల కేసీఆర్ స్వయంగా బెంగళూరుకు వెళ్లి కుమారస్వామి, దేవెగౌడలతో తృతీయ కూటమిపై చర్చలు జరిపి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా కలసి పోరాడాలని నిర్ణయించుకున్నందునే ఇప్పుడు తమకు మద్దతివ్వాలని కేసీఆర్ ను కుమారస్వామి కోరినట్టు సమాచారం. . ఇక చంద్రబాబు కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో, ఆయన వైపు నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కుమారస్వామి భావిస్తున్నారు. 

మరోవైపు, గురువారం నాడు   శాసనసభా ప్రాంగణమైన విధాన సౌధలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ జాతీయ నేతలు అశోక్ గెహ్లాట్, గులాంనబీ ఆజాద్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురు ఎమ్మెల్యేలు బైఠాయించారు.  జేడీఎస్ నేతలు కూడా విధాన సౌధకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు

Related Posts