హైదరాబాద్, ఏప్రిల్ 26,
బండి సంజయ్ బాగానే పని చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఎప్పటికప్పుడు ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రజా సంగ్రామ పేరుతో పాదయాత్ర చేస్తూ జిల్లాలు చుట్టొస్తున్నారు. బండి లీడర్‌షిప్‌లో కమలదళంలో సైతం కదనోత్సాహం పెరిగింది. తగ్గేదేలే అంటూ బీజేపీ శ్రేణులు కారు పార్టీ మీద తీవ్రంగా దాడులు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. బండి బెటరే. ఏదో మిస్ అవుతోంది. ఇదో తగ్గింది. ఇంకా ఏదో కావాలి. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బండి రైజింగ్ సరిపోదనేది అధిష్టానం లెక్క. కేవలం విమర్శలు, దూకుడునే ప్రాతిపదికన తీసుకోలేమని అంటోందట హైకమాండ్. ఆ కోవలో చూస్తే.. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్, రఘునందన్‌రావుల మాటలు, దూకుడు.. బండి సంజయ్‌ని మించి ఉంటుంది. ఇలా ఎలా చూసినా బండితో ఆ ముగ్గురు సరిసమానమే అంటున్నారు. సో, కేవలం బాగా తిడుతున్నారనే ప్రాతిపదికన పూర్తిగా సంజయ్ మీదే ఆధారపడే పరిస్థితి లేదంటున్నారు. ఆయన సీఎం స్థాయి లీడర్ కాదనేది బీజేపీ అధినాయకత్వం అభిప్రాయమని తెలుస్తోంది. మరెవరు..? ఎవరైతే కేసీఆర్‌కు సమఉజ్జీ అవుతారు? ఇంకెవరైతే సీఎం కుర్చీకి సరిపోతారు? అని చూస్తే.. ఈటల రాజేందర్ అయితేనే అందుకు బెస్ట్ లీడర్ అంటున్నారు కమలం శ్రేణులు. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం ఒక్కటే ఆయనకు మైనస్ పాయింట్. మిగతా అన్ని అంశాల్లో కేసీఆర్‌కు సరైన మొనగాడు ఈటలనే అంటున్నారు. తంబాకు నమిలే నాయకుడు, విషయ పరిజ్ణానం లేని అధ్యక్షుడు అంటూ టీఆర్ఎస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌కు.. అటు, పార్టీ పాత కాపుల నుంచీ సహాయ నిరాకరణ, వ్యతిరేకత ఎదురవుతోందని తెలుస్తోంది. అందుకే, బండిని సైడ్ చేసి.. ఆయన ప్లేస్‌లో ఈటలను ముందువరుసలో నిలిపేందుకు కొందరు సో కాల్డ్ సీనియర్లు సీరియస్‌గా అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నారని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. ఈ విషయం తెలిసే బండి సంజయ్.. ఈటల రాజేందర్ ను బాగా సైడ్ చేస్తున్నారని.. ఆయన జిల్లా పర్యటనలు చేయకుండా చెక్ పెడుతున్నారని అంటున్నారు. ఉద్యమ నేతగా, కేసీఆర్‌కు సమకాలికుడిగా.. తెలంగాణ వ్యాప్తంగా ఈటల రాజేందర్‌కు మంచి ఇమేజ్ ఉంది. ఉద్యమ నాయకుడిగా గుర్తింపు, పరపతి ఇంకా ఉంది. ఇప్పటికీ బీజేపీకి అర్భన్ పార్టీ అనే ముద్రనే ఉంది. ఉత్తర తెలంగాణ మినహా.. మిగతా జిల్లాల్లో బీజేపీకి లీడర్లు, కార్యకర్తల కొరత ఉంది. ఇక ఓటర్లు చాలా చాలా తక్కువ. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, పాలమూరు తదితర జిల్లాల్లో కాషాయ జెండా మోసేవారు తక్కువ. డీకే అరుణ లాంటి ఒకరిద్దరు నేతలు మినహా.. పెద్దగా పేరున్న నాయకులు లేరు. ఇక, బండి సంజయ్‌కు సైతం ఆ ఏరియాల్లో అంత పరపతి కానీ, ఫేస్ వ్యాల్యూ కానీ లేదంటున్నారు. అదే, ఈటల రాజేందర్ అయితే.. తెలంగాణ మూలమూలల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. గత ఉద్యమ పరిచయాలు, పోరాటాలు ఆయనకు-బీజేపీకి బాగా కలిసొస్తాయని అంటున్నారు. అందుకే, బండి కంటే ఈటల అయితే మరింత బెటర్ అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ఎన్నికల నాటికైనా ఈటలను పార్టీ తరఫున మరింత ప్రమోట్ చేస్తారని సమాచారం. అది పార్టీ అధ్యక్షుడిగానా? ముఖ్యమంత్రి కేండిడేట్‌గానా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదని అంటున్నారు.