YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇఫ్తార్ ఏర్పాట్లను పరిశిలించిన మంత్రి అంజాద్ బాషా

ఇఫ్తార్ ఏర్పాట్లను పరిశిలించిన మంత్రి అంజాద్ బాషా

విజయవాడ
ఈ నెల 27 న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  ఇఫ్తార్ విందు కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను   మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా,  ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎమ్మెల్సీ రూహుల్లా , లేళ్ళ  అప్పిరెడ్డి , ఎమ్మెల్యే లు విష్ణు , వెల్లంపల్లి శ్రీనివాస్ తదతరులు పరిశీలించారు.
మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ 27 వ తేదీ బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. ముస్లిం సోదరులందరు ఇఫ్తార్ విందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ను ఏర్పాటు చేస్తున్నాం. గత 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని  ఏర్పాటు చేయలేకపోయాము. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు పెద్ద పీట వేస్తుందని అన్నారు. గతం లో ఎన్నడూ లేని విధం గా నామినేటెడ్ పదవులలో మైనారిటీల కు అనేక పదవులు ఇచ్చారు. అనేక దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మైనారిటీల సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్దత కల్పించారు. ఏపీలో రెండో అధికార బాషా గా ఉర్దూను ప్రకటించారని అన్నారు.
వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ  వన్ టౌన్ లో 15 కోట్ల తో ముసాఫిర్  ఖాన ను బుధవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. గతం లో టీడీపీ ప్రభుత్వం మైనార్టీల పై దేశ ద్రోహం పెట్టిన చరిత్ర ఉంది. ప్రతిపక్షం లో ఉండగా మైనారిటీల కు ఏమి చేయలేకపోయారు. ప్రతి పక్షం లో ఉంటే ఒక లాగా అధికార పక్షం లో ఉంటే మరో లాగా టీడీపీ నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మైనారిటీలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని అయన అన్నారు.

Related Posts