విజయవాడ
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మత సంతుస్టికరణ ఆలోచనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా పయనిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ కో ఇంచార్జ్ సునీల్ దేవధర్ తీవ్రంగా ఆరోపించారు. నెల్లూరులో మొన్న జరిగిన హనుమాన్ శోభా యాత్ర సందర్భంగా టీటీడీ కళ్యాణమండపం నుండి ప్రారంభమై స్టోన్ హౌస్ పేట వరకు పోలీసు అనుమతి పై జరుగుతున్న సమయంలో, మద్రాస్ బస్టాండ్ సమీపంలో యాత్రపై తీవ్రవాద ప్రేరేపిత మతఛాందసవాద వాదులు ఒక్కసారిగా యాత్రపై రాళ్లు బీరుబాటిళ్ల, ఇతర వస్తువులతో దాడి చేసి, భగవాన్ హనుమాన్ విగ్రహంపై కూడా దాడి చేయడాన్ని ఖండించారు. ఇలాంటి సంఘటనలను బీజేపీ చూస్తూ ఉరుకోదని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలా హిందువులు, హిందూ పండుగలు దేవాలయాలపై దాడులు జరుగుతున్న అధికార పార్టీ కళ్ళప్పగించి చూస్తోందని, ప్రతిపక్ష తెదేపా కూడా మౌనం వహించడం ద్వారా రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని దుయ్యబట్టారు.