YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమి పూజ చేసిన సీఎం కేసీఆర్

మూడు  సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రులకు  భూమి పూజ  చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ లో  మూడు  సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రులకు  భూమి పూజ  చేశారు  ముఖ్యమంత్రి కేసీఆర్.  తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్  మెడికల్ సైన్సెస్  పేరుతో 3 హాస్పిటళ్ల  నిర్మాణానికి  ప్లాన్ చేసింది  ప్రభుత్వం. ఉదయం 11.30 కు ఎల్బీనగర్  నియోజకవర్గ పరిధిలోని  గడ్డి అన్నారంలో టిమ్స్ కు  భూమి పూజ  చేశారు కేసీఆర్.  హాస్పిటల్ నిర్మాణ  ప్లాన్   ఫొటో ఎగ్జిబిషన్ ను  చూశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గోన్నారు.  తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి రూ.రూ.2,679 కోట్లతో పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేసింది. కరోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్ను ఏర్పాటు చేసి సేవలందించగా, ఈ మూడింటితో కలిపి టిమ్స్ దవాఖానల సంఖ్య నాలుగుకు చేరనున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో నగరం నలువైపులా సూపర్ స్పెషాల్టీ దవాఖాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉస్మానియా, గాంధీ, నిమ్స్.. అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు ఈ ధర్మాసుపత్రులే దిక్కు.  రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఏ పెద్ద రోగమొచ్చినా వీటివైపే చూస్తారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఏండ్లు గడిచినా.. జనాభా అంతకంతకు పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకటి, రెండు.. కాదు.. ఏకంగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు హైదరాబాద్ మహా నగరం వేదిక కాబోతున్నది.

Related Posts