YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

య‌డ్యూరప్పకు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ శుభాకాంక్ష‌లు

య‌డ్యూరప్పకు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ శుభాకాంక్ష‌లు

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బిఎస్ య‌డ్యూర‌ప్పా ప్ర‌మాణ స్వీకారం చేయనున్న సంద‌ర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ య‌డ్యూర‌ప్పాకు శుభాకాంక్ష‌లు తెలిపారు. అధిక సీట్లు సాధించి బిజెపి క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంద‌ర్భంగా య‌డ్యూరప్ప‌కు ఆ భ‌గ‌వంతుడు అన్ని విధాలా శ‌క్తి, సామ‌ర్ధ్యాల‌ను, ఆశీస్సుల‌ను అందించాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ కోరుకున్నారు.క‌ర్ణాట‌క ఫ‌లితాల స్ఫూర్తితో తెలంగాణ‌లోనూ బిజెపి అధికారంలోకి వ‌చ్చేందుకు పార్టీ నాయ‌క‌త్వం, పార్టీ శ్రేణులు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్న‌ట్లు డాక్ట‌ర్ లక్ష్మ‌న్ తెలిపారు. దేశంలో ఇప్పుడు మోదీ గాలి  వీస్తుంద‌ని, ప్ర‌జా సంక్షేమానికి మోదీ అవిర‌ళ కృషి చేస్తున్నార‌ని, దీంతో ప్ర‌జ‌లు బిజెపికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న్నారు.

Related Posts