ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలకు అధిక పని గంటల నుండి విముక్తి కలిగించిన రోజు మే డే, (ప్రపంచ కార్మిక దినోత్సవం) పండుగను జయప్రదం చేయాలని, రాయలసీమ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మడగలం ప్రసాద్ అన్నారు.
ఆర్ సి పి కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించరు, ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, మే డే పూర్వము, కార్మికులకు పని గంటలు ఉండేవికావని, యజమానుడు 16 గంటలు 20 గంటలు కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న రోజులలో, ఎర్రజెండా నాయకత్వాన, కార్మికుల పక్షాన, ఎనిమిది గంటల పని దినాలుకై వేలాది మంది తన రక్త ,ప్రాణాలను అర్పించి పోరాడి సాధించిపెట్టిన ఘనమైన రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే అని తెలిపారు. ఎనిమిది గంటల పనిని హక్కుగా పనిచేసే ప్రతి కార్మికుడు మే డేను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఆనాడు యందరో త్యాగదనులు తమ ప్రాణాలను ధారపోసిన సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను, ప్రస్తుత పాలకులు కాలరాస్తున్నారని, పాలకులు పెట్టుబడి దారుల చేతుల్లో కీలుబొమ్మగా మారి కార్మికులను వారికి తాకట్టు పెట్టే దిశగా మారారని, దాని ఫలితమే ఈ రోజు మళ్ళీ 12 గంటలు, 16 గంటల పని చేస్తున్న కార్మికులను మనం చూస్తున్నామని ఆయ అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఉపాధి కల్పించడంలో తీవ్ర వైఫల్యం చెందారని దాని ఫలితమే ఈ రోజు మళ్లీ 12 గంటలు 16 గంటలు పని దినలు వచ్చాయని, వాటికి వ్యతిరేకంగా మళ్లీ ఎర్రజెండా నాయకత్వాన ఉద్యమ బాటకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లాలో జరిగే కార్మిక ర్యాలీలను, సభలను, సమావేశాలను, జండా ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీ జి హెచ్ పి ఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ నాగరాజు పాల్గొన్నారు.