నెల్లూరు
మానవతా సి ఓ బి కమ్యూనిటీ నెల్లూరు జిల్లా లోని ట్రాన్స్ జెండర్ లకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని మానవతా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రభుత్వాన్ని కోరింది. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ లకు అధ్యక్షులు కార్యదర్శులు అనే వాళ్ళు ఎవరూ లేరని అందరూ మానవతా సి ఓ బి ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ సభ్యులు మాత్రమేనని తెలియజేశారు. ట్రాన్స్జెండర్స్ లను సమాజంలో చులకన భావంతో చూస్తున్నారని తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఇటువంటి వృత్తి ఆధారం లేకుండా భిక్షాటన చేస్తూ జీవనాధారం చేస్తున్న ట్రాన్స్ జెండర్ ల కమ్యూనిటీకి ప్రభుత్వం చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకం లో భాగంగా ట్రాన్స్జెండర్ లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, ఇండ్ల స్థలాలు, బ్యాంకు రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ అభివృద్ధి సంక్షేమానికి విద్యా పరంగా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు జిల్లాలో సుమారు 1000 మందికి పైగా ట్రాన్స్ జెండర్ లు ఉన్నారు అని తెలియజేశారు. వారందరికీ కమ్యూనిటీ బాధ్యత సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్ జెండర్ లు వి. శీలమ్మ, ఏ. మరియమ్మ, ఎస్కే సల్మా, ఎస్.కె. హేమ, డి. శిల్ప, పి. కుమారి, డి . సమీరా తదితరులు పాల్గొన్నారు.