YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా విప్లవ విద్యార్థి జార్జిరెడ్డి 50 వ వర్ధంతి

ఘనంగా విప్లవ విద్యార్థి జార్జిరెడ్డి 50 వ వర్ధంతి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యువ మేధావి విప్లవ విద్యార్థి జార్జిరెడ్డి 40వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న పాత అనిత సినిమా హాల్ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్. రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి అమరత్వ స్ఫూర్తిని కొనసాగించే విధానంలో భాగంగా పిడిఎస్యు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విప్లవ విద్యార్థి జార్జిరెడ్డి 50 వ వర్ధంతి మహాసభను జరుపుకోవడం సంతోషకర విషయం అన్నారు. నేటి యువత జార్జిరెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజం సన్మార్గం వైపు పయనించాలన్న జార్జిరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల మత సామరస్య సమ్మేళనంతో సమసమాజ నిర్మాణ లక్ష్యంతో అంకితభావంతో ఉద్యమం చేపట్టిన జార్జి రెడ్డిని కొన్ని అరాచక శక్తులు ఆయనను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆక్రోశం వ్యక్తపరిచారు. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ లో అడ్మిషన్ పొందిన జార్జి రెడ్డి ఆనాడు క్యాంపస్లో మతోన్మాద శక్తులను అడ్డుకునే దిశగా ఆయన తన విధులను నిర్వహించారని పేర్కొన్నారు.
1972లో ఉస్మానియా వర్సిటీలో ప్రారంభమైన పిడిఎస్యు విధి విధానాలు నేటి పరిణామాల దృష్ట్యా 14 వస్త్రాలలో పిడిఎస్యు కొనసాగుతుందన్నారు. మతోన్మాద శక్తులను అడ్డుకోవడమే లక్ష్యంగా పి డి ఎస్ యు తన వంతు కృషి చేస్తుందన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బిజెపి ప్రభుత్వంలో నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టక పోగా రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. యువత జార్జి రెడ్డి శాస్త్రీయ విద్యా విధానంకై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు సునీల్, గ్రామీణ విద్యార్థి సంఘ నాయకులు శరత్, కార్యదర్శి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts