YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఖరీఫ్ కు జిల్లాల చిక్కులు

ఖరీఫ్ కు జిల్లాల చిక్కులు

నెల్లూరు, ఏప్రిల్ 27,
ముంచుకొస్తున్న ఖరీఫ్‌కు జిల్లాల విభజన ఆటంకంగా తయారైంది. సీజన్‌ ప్రారంభమవు తుందనగా కొత్త జిల్లాలు ఉనికిలోకి రావడంతో వ్యవసాయ, అనుబంధ శాఖల పాలన గందరగోళంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కాగా 60-70 శాతం పంటల సాగు వానాకాలంలోనే జరుగుతుంది. సరిగ్గా ఇప్పుడే కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు రావడంతో వ్యవసాయశాఖలో యుద్ధప్రాతిపదికన అధికారుల నియామకం చేపటా ్టల్సి వచ్చింది. సుదీర్ఘకాలం కమిషనర్‌గా పని చేసిన హెచ్‌ అరుణ్‌ కుమార్‌ బదిలీ అయ్యారు. ఆ స్థానం లోకి సిహెచ్‌ హరికిరణ్‌ వచ్చారు. వ్యవసాయ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డిప్యూటి డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ పదోన్నతులు జరిగి చాలా కాల మైంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అధికారుల నియామకం ఇబ్బందికరంగా మారింది. గతంలో జిల్లా వ్యవసాయాధికారిగా జెడిఎలను వేయగా, జిల్లాల విభజన తర్వాత తెలంగాణ తరహాలో డిడిలను డిస్ట్రిక్టు అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ (డిఎఒ) పేరిట వేశారు. కొన్నిచోట్ల జెడిఎలనే డిఎఒలుగా కొనసాగించారు. కొత్తగా ఏర్పాటైన 24 రెవెన్యూ డివిజన్లకు డిడిలను నియమించలేదు. పక్క డివిజన్‌ అధికారులను తాత్కాలిక ఇన్‌ఛార్జీలుగా వేశారు. కొత్త సర్వీస్‌ ఏరియాలు కావడం, తక్షణం ఖరీఫ్‌ ఏర్పాట్లు చేయాల్సి రావడంతో అయోమయం నెలకొంది.తొలకరి వానలు సకాలంలో కురిస్తే జూన్‌ నుండి సీజన్‌ మొదలవుతుంది. ఉత్తరాంధ్రలో మే మూడవ వారంలోనే ముందస్తు పంటలు వేస్తారు. తక్షణం విత్తన ప్రణాళిక అమలు చేయాలి. రాయితీ విత్తనాల ను సేకరించాలి. సబ్సిడీ లేని సీడ్స్‌ను సైతం అందు బాటులో ఉంచాలి. దాదాపు ఏడెనిమిది లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం సేకరించాలి. రాయల సీమకు వేరుశనగే 60 శాతం పైన ఉంటుంది. సేకరణ ఆలస్యమైతే నాసిరకం వచ్చే ప్రమాదం ఉంది. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో ముందస్తు రిజిస్ట్రేషన్‌ వంటి తంతు ఉన్నదే. మే మూడవ వారం నుండి వేరుశనగ విత్తనం పంపిణీ ప్రారంభం కావాలి. గతంలో ప్రతి జిల్లాకూ ఎపి సీడ్స్‌ మేనేజర్లు ఉండేవారు. జిల్లాల విభజనతో చాలా జిల్లాలకు మేనేజర్లు లేరు. ఎరువుల సేకరణ సకాలంలో జరగాలి. ఆర్‌బికెలు, పిఎసిఎస్‌లు, డిసిఎంఎస్‌లకు మార్క్‌ఫెడ్‌ నుండి ఎరువులు అందాలి. కొత్త జిల్లాలకు మార్క్‌ఫెడ్‌ అధికారులు లేరు. ఎరువుల మూమెంట్‌ పై పర్యవేక్షణ వారిదే. పరపతి వ్యవస్థ సైతం ఇబ్బందుల్లోనే ఉంది. కొత్త జిల్లాలకు లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్లు రావాల్సి ఉంది. కలెక్టర్లు రుణ ప్రణాళికను ఖరారు చేయాలి. సహకార రంగంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డిసిసిబి) సర్వీస్‌ ఏరియా, పాలనకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి లేనందున పాత పద్ధతిలోనే కొనసాగుతు న్నాయి. దాంతో సహకార పరపతి వ్యవహారం గందరగోళంగా మారింది. ఇదే సమయంలో మేలో రైతులకు రైతు భరోసా సాయం, గత ఖరీఫ్‌ పంట నష్టాలకు ఇన్సూరెన్స్‌, పంట రుణాలపై సున్నా వడ్డీ క్లెయిము చెల్లింపులకు ఇబ్బందులేర్పడ్డాయి. సాగు సాగించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చే విష యంలోనూ సమస్యలొస్తున్నాయని చెబుతున్నారు.

Related Posts