హైదరాబాద్, ఏప్రిల్ 27,
తెలంగాణలోనూ ఏ నేత నోట విన్నా ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు వస్తుంది.. ఆయన చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్న, మొన్నా కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ కాగా.. మరోవైపు ఢిల్లీలోనూ పీకే వ్యవహారానికి సంబంధించిన పరిణామాలు జోరుగా సాగాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజేంటేషన్‌పై 8 మంది సభ్యులు… సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నివేదికపై కూలంకుషంగా చర్చించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎంపవర్డ్ ఆక్షన్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు. మే 13, 14న, 15 తేదీల్లో మూడు రోజుల పాటు నవ సంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 400 మంది కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. వర్తమాన, సాంఘిక రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, మైనార్టీ, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.మరోవైపు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరికపై సోనియాకు నివేదిక సమర్పించింది… ప్రత్యేక కమిటీ. ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై.. కమిటీతో చర్చించారు సోనియా గాంధీ. సోనియాతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా భేటీ కానున్నారు. కాంగ్రెస్‌లో పీకే చేరిక, నిర్వర్తించాల్సిన బాధ్యతలపై సోనియా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ భేటీ హాట్ టాపిక్ అయ్యింది. గతంలో వీరిద్దరు సమావేశం అయినా ఇంతగా డిస్కషన్ జరగలేదు. ఓ వైపు కాంగ్రెస్‌లో చేరికపై అధిష్టానంతో చర్చలు జరుపుతూనే, మరోవైపు కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం.. కొత్త అనుమానాలు, చర్చలకు దారి తీసింది. ముఖ్యంగా టీకాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై చర్చలు జరిగాయని కొందరు, టీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే భేటీ అయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక, సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ సమావేశంపై మాణిక్యం ఠాగూర్ పరోక్ష ట్వీట్లు చేశారు. శత్రువుతో స్నేహం చేసే వారిని నమ్మొద్దన్నారు. చిన్న అవకాశం ఉన్నంత కాలం… నమ్మకాన్ని కోల్పోనూ అంటూ గాంధీ చెప్పిన కొటేషన్‌ను ట్వీట్ చేశారు. ఠాగూర్ చేసిన ట్వీట్లు ఆసక్తిగా మారాయి