నెల్లూరు
నెల్లూరు నగరంలో 10 కిలో వాట్స్ గల పూర్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని బుధవారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసార భారతి సి.ఈ.ఓ వి. శశి శేఖర్, ఆల్ ఇండియా రేడియో డి.జి వేణుధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, శాసన మండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి స్రవంతి, జిల్లా ఎస్పీ విజయరావు, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్, నెల్లూరు కార్పొరేషన్ కమీషనర్ జాహ్నవి, ఆర్.డి.ఓ కొండయ్య, నెల్లూరు ఆల్ ఇండియా రేడియో కేంద్రం అధికారి సోమేశ్వర రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.