YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రధాని సొంత రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు. కేసీఆర్..

ప్రధాని సొంత రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు. కేసీఆర్..

హైదరాబాద్, ఏప్రిల్ 27,
దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. కరేంటు కోతలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని తెలంగాణలో లేవని పేర్కొన్నారు. కర్ణాటక, ఏపీ సహా ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లో కూడా విద్యుత్ కోతలు ఉన్నాయని CM KCR పేర్కొన్నారు. దేశంలో తాగునీరు, సాగునీరు, కరేంటు లేదని.. ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోవాల్సిందేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ 21 వ‌సంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అంటూ స్పష్టంచేశారు. తెలంగాణ జల బండగారం అయిందని వెల్లడించారు. అవినీతితో వికెట్ పడే మంత్రులు తెలంగాణలో ఎవరూ లేరంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 3 మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు నిర్మించుకుంటున్నామని తెలిపారు.టీఆర్ఎస్ పని చేసిన తీరుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరు ఉంటే 14లక్షల కోట్ల జిడిపి ఉండేదని.. కానీ అసమర్ధత వల్ల అట్టడుగు చేరుకుందని తెలిపారు. దేశంలో స్వతంత్ర ఫలాలు అందరికీ లభించలేదని పేర్కొన్నారు. దేశంలో పెడ దోరణి పెరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరేళ్ల కాలంలో వెలుగు జిలుగుల తెలంగాణను ఆవిష్కరించామని.. కానీ దేశంలో కరెంట్ కోతలు ఎందుకు ఉన్నాయంటూ ప్రశ్నించారు. దేశ నదుల్లో నీటి లభ్యత 65వేల టిఎంసి అని.. 30వేల టీఎంసీలను మాత్రమే దేశం వినియోగించుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం.. లోపం ఎక్కడ ఉందంటూ నిలదీశారు.దేశంలో తాగునీరు, సాగునీరు లేవని.. మౌలిక వసతులు లేవని పేర్కొన్నారు. దీనికి కారణం ఎవరంటూ నిలదీశారు. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలని.. పరిష్కారం లభించాలన్నారు. అందుకోసం మనం దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు
65 వేల టీఎంసీల నీరు ఉన్నా..యుద్ధాలేనా
ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్క‌లంగా ఉండ‌గా.. రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా సీఎం కేసీఆర్ దేశంలోని నీటి వ‌న‌రుల‌పై ప్ర‌సంగించారు.ఈ దేశంలో స‌జీవంగా ప్ర‌వ‌హించే న‌దుల్లో ఉన్న నీటి ల‌భ్య‌త 65 వేల టీఎంసీలు అని కేసీఆర్ తెలిపారు. మ‌రో నాలుగైదు టీఎంసీల లెక్క తేలాల్సి ఉంది. ఇది అంత‌ర్జాతీయ గొడ‌వ‌ల్లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ట్టిన ప్రాజెక్టుల ద్వారా 29 వేల టీఎంసీలు మాత్ర‌మే దేశం వాడుకుంటోంది. దేశంలో ఎక్క‌డా చూసిన నీటి యుద్ధాలే. దీనికి కార‌ణం ఎవ‌రు. 65 వేల టీఎంసీల నీరు ఉండి కావేరి జ‌లాల‌ కోసం త‌మిళ‌నాడు – క‌ర్ణాట‌క మ‌ధ్య‌ యుద్ధం, సింధూ – స‌ట్లెజ్ జ‌లాల కోసం రాజ‌స్థాన్ – హ‌ర్యానా మ‌ధ్య యుద్ధం ఏర్ప‌డింద‌న్నారు.క‌నీసం తాగునీళ్ల‌కు కూడా ఈ దేశం నోచుకోవ‌డం లేదని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాగునీటి స‌మ‌స్య‌లున్నాయి. క‌రెంట్ కోత‌లున్నాయి. మాట‌లు చెప్తే మైకులు హోరెత్తుతున్నాయి. వాగ్దానాల హోరు.. ప‌నిలో జీరో. మౌలిక వ‌స‌తులు లేవు అని కేంద్రాన్ని విమ‌ర్శించారు. తాగ‌డానికి నీల్లు లేని దుస్థితిలో ఈ దేశం ఉంది. ఇది ఎవ‌రి అస‌మ‌ర్థ‌త‌. ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డాలి. ఇందుకోసం జ‌రిగే ప్ర‌స్థానంలో, ప్ర‌య‌త్నంలో ఉజ్వ‌ల‌మైన పాత్ర మన రాష్ట్రం పోషించాలని కేసీఆర్ పేర్కొన్నారు.ఒక్క‌టే ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ దేశంలో అత్య‌ధిక యువ‌శ‌క్తి ఉంద‌ని కేసీఆర్ తెలిపారు. 13 కోట్ల మంది భార‌తీయులు విదేశాల్లో జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. భార‌త పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే.. ఇక్క‌డ వారి త‌ల్లిదండ్రులు పార్టీలు చేసుకుంటున్నారు. ఏమిటీ ఈ దౌర్భాగ్యం. అన్ని వ‌న‌రులు ఉండి ఈ దేశం ఎందుకు కూనారిల్లుతుంది. దీని మీద అంద‌రం ఆలోచించాలి. ప్ర‌జా జీవితంలో ప‌ని చేస్తున్నాం కాబ‌ట్టి.. ఈ దేశానికి ప‌ట్టిన దుస్థితిని త‌రిమేయాలి. మ‌ట్టి, నీళ్లు లేని సింగ‌పూర్ ఆర్థిక ప‌రిస్థితిలో నంబ‌ర్ వ‌న్‌లో ఉంద‌న్నారు. మంచినీల్లు కూడా మ‌లేషియా నుంచి కొంటారు. అన్నం ముద్ద కూడా వారిది కాదు. ఆ దేశంలో ఏమి లేదు.. కానీ ఆర్థిక స్థితిలో నంబ‌ర్ వ‌న్‌గా ఉంది. మ‌న ద‌గ్గ‌ర అన్ని ఉన్నాయి కానీ ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డ‌టం లేదు. ఇది క‌ఠోర‌మైన వాస్త‌వం.. నిప్పులాంటి నిజం అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
హైదరాబాద్  వేదికగా అడుగులు కావాలి
2000లో తాను తెలంగాణ అని మాట్లాడితే.. ఏం ప‌ని లేదా అని కొంద‌రు అన్నారు. సంక‌ల్పంతో జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులకు, ఆ భ‌గ‌వంతుడికి దండం పెట్టి బ‌య‌లుదేరి తెలంగాణ సాధించాం. అంతేకాదు.. సాధించిన తెలంగాణ‌ను దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిలిచేలా చేశామ‌న్నారు. పాల‌మూరు జిల్లాలో వ‌ల‌స‌లు పోయేవారు. ఇవాళ వ‌ల‌స‌లు రివ‌ర్స్ వ‌చ్చాయి. 11 రాష్ట్రాల నుంచి మ‌న వ‌ద్ద‌కు వ‌ల‌స‌లు వ‌స్తున్నారు. బీహార్ హ‌మాలీ కార్మికులు లేక‌పోతే తెలంగాణ రైస్‌మిల్లులు న‌డ‌వ‌వు. హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ లో భ‌వ‌న నిర్మాణ రంగంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ కార్మికులు ప‌ని చేస్తున్నారు. తెలంగాణ‌లో ప‌ని పుష్క‌లంగా దొరుకుతోంది. శాంతి భ‌ద్ర‌త‌లు ప‌టిష్టంగా ఉన్నాయని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.చేయ‌గ‌లిగే సామ‌ర్థ్యం, సంక‌ల్పం, చిత్త‌శుద్ధి ఉంటే ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆర్థిక‌శ‌క్తిగా ఎదిగే వ‌న‌రుల‌ను భార‌త్ క‌లిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఇవాళ దుఖ ప‌డుతున్నాం. నివార‌ణ జ‌ర‌గాలి. కేసీఆర్ రాజ‌కీయ ఫ్రంట్ ప్ర‌క‌టిస్తాడా? అని అంటున్నారు. దేశం బాగు కోసం ఒక ప్రాసెస్ జ‌ర‌గాలి. భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన ఫ్రంట్ ఉంట‌ది. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్ర‌త్యామ్నాయ ఎజెండాకు శ్రీకారం చుడుదాం. దేశం బాగుప‌డ‌టానికి మ‌న రాష్ట్రం నుంచి ప్రారంభం జ‌రిగితే అది మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అని సీఎం అన్నారు.తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన.. దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి, గ‌తిని, స్థితిని మార్చ‌డానికి, దేశాన్ని స‌రైన ప్ర‌గ‌తి పంథాలో న‌డిపించ‌డానికి హైద‌రాబాద్ వేదిక‌గా కొత్త ఎజెండా, ప్ర‌తిపాద‌న‌, సిద్ధాంతం త‌యారై దేశం న‌లుమూల‌ల వ్యాపిస్తే ఈ దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ గుంపు కాదు.. కూట‌మి కాదు.. ప్ర‌త్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలి. ఆ దారులు వెత‌కాలి. నూత‌న వ్య‌వ‌సాయ విధానం, నూత‌న ఆర్థిక విధానం, నూత‌న పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవ‌స‌ర‌మైన వేదిక‌లు త‌యారు కావాలి. ఆ భార‌త‌దేశం ల‌క్ష్యంగా పురోగ‌మించాలి. సంకుచిత రాజ‌కీయాలు వ‌ద్దు. దేశానికి కావాల్సింది అభ్యుద‌య ప‌థం కావాలి. అప్పుడే దేశం అద్భుతంగా బాగుప‌డ‌త‌ది. ఉజ్వ‌ల‌మైన భార‌త్ త‌యారవుతోంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
అమరవీరుల స్థూపానికి నివాళులు
టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ ప్రాంగ‌ణానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ప్లీన‌రీ స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, హ‌రీశ్‌రావు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, శ్రీనివాస్ గౌడ్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గువ్వ‌ల బాల‌రాజు, బాల్క సుమ‌న్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.
 

Related Posts