YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ప్రజాస్వామ్యం ఖూనీ కావడం చూసి భారతావని మౌనం పాటిస్తోంది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

ప్రజాస్వామ్యం ఖూనీ కావడం చూసి భారతావని మౌనం పాటిస్తోంది       కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

కర్ణాటక ఎన్నికల ఫలితాల నాటి నుంచి మౌనంగా ఉన్న రాహుల్‌గాంధీ.. ఎట్టకేలకు తాజా పరిస్థితులపై పెదవి విప్పారు. కర్ణాటక సీఎంగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఇది బీజేపీ అహేతుకమైన పట్టుదలని రాహుల్ వ్యాఖ్యానించారు.ఈ ఉదయం బీజేపీ విజయోత్సవాలను జరుపుకుంటూ ఉంటే, భారతావని ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి మౌనం పాటిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్నీ బీజేపీ అపహాస్యం చేసిందని నిప్పులు చెరిగారు. ‘భాజపాకు తగినంత సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పట్టుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఉదయం భాజపా తన బూటకపు విజయంపై సంబరాలు చేసుకుంటుంటే.. ఓడిపోతున్న ప్రజాస్వామ్యాన్ని చూసి దేశం విచారిస్తోంది’ అని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు.ఎన్నికల ఫలితాల్లో భాజపాకు 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి మెజార్టీ రానందున కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని భాజపా గవర్నర్‌ను కోరింది. గవర్నర్‌ కూడా ఇందుకు అంగీకరించడంతో యడ్యూరప్ప నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించడంతో రెండు రోజుల ఉత్కంఠ ముగిసింది. అయితే గవర్నర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. యడ్డీ ప్రమాణస్వీకారానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టారు. అయితే 15 రోజుల్లోగా యడ్డీ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా భాజపా నేత యడ్యూరప్ప గురువారం ప్రమాణస్వీకారం చేయడం తో కర్ణాటకీయానికి తెరపడింది. 

Related Posts