విజయవాడ ఏప్రిల్ 28,
జగనన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీని ధిక్కరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. బహిరంగ విమర్శలు చేసే వారినీ పక్కన పెట్టేస్తానని స్పష్టం చేశారు. ఆ మేరకు మంత్రులు, వైసీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్‌రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ వార్నింగ్‌తో.. ఇటీవల ఓవరాక్షన్ చేసిన మాజీ మంత్రులు బాలినేని, సుచరిత, అనిల్ నుంచి.. మినిస్టర్ పోస్ట్ రాలేదని రచ్చ రచ్చ చేసిన సామినేని, పిన్నెళ్లి, కోటంరెడ్డి తదితరలు అందరికీ జగనన్న షాక్ ఇచ్చారని అంటున్నారు. వారిని ఉద్దేశించే ఇలాంటి హెచ్చరిక చేశారని చెబుతున్నారు. పార్టీలో తానే సుప్రీం అని.. తోక జాడిస్తే.. ఎమ్మెల్యే టికెట్ కట్ చేస్తానంటూ.. బాసిజం ప్రదర్శించారు జగన్‌విభేదాలు వీడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మే లో ‘ఇంటింటికి వైసీపీ’ కార్యక్రమం నిర్వహిద్దాం. విభేదాలు వీడి కలసికట్టుగా పని చేయాలి. త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తా. జులై 8న ప్లీనరీ’’ అని ఆ మీటింగ్‌లో జగన్ చెప్పారు. పనిలో పనిగా ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతానని స్పష్టం చేశారు. రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీంమన్నారు. గెలిస్తేనే మంత్రి పదవి అని, గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎవ్వరూ తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదని.. 175కి 175 సీట్లు ఎందుకు గెలవమని జగన్ అన్నారు.