YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీగా రబీ సాగు

భారీగా రబీ సాగు

గుంటూరు, ఏప్రిల్ 28,
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్‌ ఆయకట్టు కింద రబీలో 72,731 ఎకరాల్లో వరి సాగైంది. ప్రధానంగామాచర్ల, గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని రైతులు వరి పంట వేశారు. ప్రస్తుతం పంట కోతదశకొచ్చింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడిని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.82 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో లక్ష మెట్రిక్‌ టన్నల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరికి మద్దతు ధర కూడా ప్రకటించింది. సూపర్‌ ఫైన్‌ రకం క్వింటాకు రూ.1960, దుడ్డురకం       క్వింటాకు రూ.1940 చెల్లించనున్నట్టు ప్రకటించింది.గత ఖరీఫ్‌ సీజన్‌లో సేద్య ఖర్చులు పెరగడంతోపాటు ఎలుకల బెడదతో దిగుబడి తగ్గింది. ఎకరానికి 20 సెంట్ల నుంచి 30 సెంట్లలోని పంటను ఎలుకలు పాడుచేశాయని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఎకరానికి 30 బస్తాలే దిగుబడి వచ్చిందని పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు రబీ సీజన్‌ ఆశాజనకంగా ఉందని, ఖరీఫ్‌ మిగిల్చిన స్వల్ప నష్టాలను రబీ భర్తీ చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబీలో చీడపీడల బెడద లేదని చెప్పారు. ఎకరానికి 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సాగర్‌ ఆయకట్టులో నీటి లభ్యత గతేడాది కంటే అధికంగా ఉండడం కూడా కలిసొచ్చిందని, ఏప్రిల్‌ 15 వరకు సాగు జలాలు విడుదలయ్యాయని తెలిపారు.   జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు్ల చేశాం. సోమ వారం నుంచి ఎక్కడైతే ధాన్యం పండించారో అక్కడే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. గన్నీ బ్యాగులు, తేమను కొలిచే పరికరాలు సిద్ధం చేశాం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే పంటను కొంటాం.   ఖరీఫ్‌లో ఆరెకరాలు వరిసాగు చేయగా 175 బస్తాలు దిగుబడి వచ్చింది. రబీలో మళ్లీ ఆరెకరాలు సాగు చేశా. ఈసారి పంట చాలా బాగుంది. పెట్టుబడి వ్యయం తగ్గింది. ఆరెకరాల మీద 240 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్నా. 75 కేజీల బస్తా రూ.1500 వరకు పలుకుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం కూడా ధాన్యం   కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.

Related Posts