YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

70 రోజులు కష్టపడితర 70 ఏళ్ళు సుఖపడొచ్చు : మంత్రి హరీశ్ రావు

70 రోజులు కష్టపడితర 70 ఏళ్ళు సుఖపడొచ్చు : మంత్రి హరీశ్ రావు

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.  ప్రయత్నం చేయండి. .మీ గమ్యాన్ని ఎంచుకోండి.  20వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒకే సారి రావడం గొప్ప ఆవకాశమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం నాడు సిద్దిపేట పట్టణం టీచర్స్ భవనం లో ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత పోలీస్ కానిస్టేబుల్ శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  సిద్దిపేట జిల్లా పోలీస్ కమీషనర్ జోయల్ డెవిస్, ఇతర అధికారులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ పోలీస్ అంటే ప్రజల్లో ఒక భయం.  ఇక్కడ సిపి జోయల్ డెవిస్ పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే విధంగా కృషి చేస్తున్నారు. గమ్యానికి చేరుకోవాలని కృషి చేయాలని ఆలోచించండి. సిద్దిపేట పందులు, మురికితో ఉండేది .కానీ ఇప్పుడు సిద్దిపేట శుద్దిపేట గా మారింది.  3 ఏళ్ళు కష్టపడితే ఇది మా ప్రభుత్వానికి ,అధికారులకు సాధ్యమైంది.  పట్టుదలతో కృషి చేసి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు.... అదే దిశగా మీరు ప్రయత్నించండి. ఉద్యోగం సాధించాలంటే క్రమశిక్షణ ముఖ్యం. 60, 70 రోజులు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖంగా ఉండవచ్చని అన్నారు.  ప్రైవేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లకు ధీటుగా ఈ ఉచిత శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశాం.  తెలంగాణా ఉద్యమంలో 14 సంవత్సరాలు కష్టపడితే తెలంగాణ సాధించారు కేసీఆర్. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి...గమ్యం మీ దారికి చేరుతుందని అన్నారు.  తల దించి చదివితే జీవితాంతం తల ఎత్తుకొని బ్రతుకవచ్చు.  దేశంలో "దీ బెస్ట్ పోలీసింగ్" వ్యవస్థ గా తెలంగాణ పోలీసింగ్ నిలిచింది. సిద్దిపేట, గజ్వెల్, హుస్నాబాద్ డివిజన్లలో ఈ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాం. -  ఎవరికీ తక్కువ సామర్థ్యం అంటూ ఉండదు. మన కృషి, పట్టుదలతో ఎంతటి లక్ష్యాన్ని అయినా సాదించగలుగుతారని అన్నారు. 

Related Posts