YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కేసీఆర్ పై మండిపడ్డ సోము వీర్రాజు

కేసీఆర్ పై మండిపడ్డ సోము వీర్రాజు

రాజమండ్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ పై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందని.. పెట్రోల్ ధరలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాజమండ్రిలో బీజేపీ గోదావరి జోనల్ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్ ధరలు తగ్గాంచాలని ప్రధాని కోరితే కేసిఆర్ కావు కేక ఏంటి ? ఇలాంటి కావు కేకలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ దిగుమతులకు రూ. 20 లక్షలు కోట్లు అవసరం ఉంటుందని.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయ సూన్యత తెలంగాణలో ఉందని, ఉభయ ప్రాంతీయ పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
7 వేల 200 కోట్లు ఏపీ రాజధానికి ఖర్చు చేసి చివరకు అదే కనపడక పోవడంతో రైతులు ఉధ్యమం చేయడం జరిగిందన్నారు. ఒక పార్టీ మాట్లాడదు మరో పార్టీ మాట మారుస్తోందని, రాజధానిని వివాదం చేసిన పరిస్థితులు దేశంలో ఎక్కడా లేదు.. గతంలో రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా సమస్యలు లేవన్నారు. కుటుంబ వారసత్వ ఆలోచన ఉన్న పార్టీల వల్లే రాజదాని సమస్య వచ్చినట్లు, పోలవరం ప్రాజెక్టును డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు తీసుకుని వెళ్లాలని ప్రధాని భావిస్తున్నట్లు వెల్లడించారు. అందువల్లే ఇరిగేషన్ మంత్రి గజేంద్ర షెఖావత్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తరువాత సమీక్షలు పెంచడం జరిగిందని వివరించారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కుటుంబ పార్టీల ప్రభుత్వాలు కారణమన్నారు. ఏపీ సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమం, మొత్తం అప్పలు మయమని, మొత్తంగా రాష్ట్రం అవినీతి మయంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి ఉందని సోము వీర్రాజు హెచ్చరించారు.

Related Posts